Kochadaiyaan phones from karbonn

Kochadaiyaan phones from Karbonn, Kochadaiyaan phones with preloaded content, High low end phones with Kochadaiyaan brand name, Kochadaiyaan branded phones

Kochadaiyaan phones from Karbonn with preloaded content

కార్బన్ సంస్థ నుంచి కొచ్చాడియాన్ ఫోన్లు

Posted: 02/28/2014 04:52 PM IST
Kochadaiyaan phones from karbonn

సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చాడియాన్ సినిమా మీద అందరి కళ్ళూ ఉన్నాయి.  సినిమా నిర్మాణంలో ఇంత ఆలస్యమైనా కాస్తంతైనా ఆసక్తి తగ్గలేదు రజనీ అభిమానులలో. 

వ్యాపరరీత్యా దీని ప్రయాజనాన్నిపొందటానికి భారతదేశ సంస్థ కార్బన్ సరికొత్త ప్రయోగం చేస్తోంది.  కొచ్చాడియన్ బ్రాండ్ నేమ్ తో ఫోన్లను తయారు చేస్తోంది.  ప్రత్యేకమైన ఫోన్లలో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు కూడా ఉంటాయి. 

1.కార్బన్ కొచ్చాడియాన్ ది లిజెండ్ 2.4, 2.8 ఫోన్లలో 1.3 మెగా పిక్సెల్స్ కేమెరా, డబల్ సిమ్ సపోర్ట్ తో వస్తున్నాయి.

2. కార్బన్ కొచ్చాడియైన్ ది లిజెండ్ ఎస్ 5 ఐలో 5 అంగుళాల డిస్ప్లే, 8 మెగా పిక్సెల్స్ కేమెరా తో ఆండ్రోయిడ్ వి 4.2 (జెల్లీ బీన్) తో పనిచేస్తుంది.  4 జిబి మెమొరీ కార్డ్ లో ప్రీలోడెడ్ కంటెంట్ తో సంసిద్ధమౌతోంది.  దీని కంటే తక్కువ ఫీచర్లతో అదే బ్రాండ్ నేమ్ తో ఎ 6, ఎ 36 ఫోన్లు కూడా వస్తున్నాయి.

అయితే ఒట్టిగా కొచ్చాడియాన్ పేరు పెట్టటమే కాదు ఇందులో ఉన్న కంటెంట్ లో సినిమాలోని దృశ్యాలు, సినిమా స్క్రీన్ సేవర్స్, సినిమా డైలాగ్స్, ఫొటోలు, సినిమా ట్రైలర్, సినిమా సౌండ్ ట్రాక్ ఉంటాయి.  అంతేకాదు రజనీకాంత్ ఆటోగ్రాఫ్ చేసిన సంతకం కూడా వాటి మీద ఉంటుంది. 

ఈ ఫోన్లను జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో విడుదల చెయ్యవచ్చు.  కొచ్చాడియాన్ సినిమా విడుదల సమయంతో కలిసివచ్చేట్టుగా ఈ సినిమాను విడుదల చెయ్యవచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles