Harish rao questions congress actions

Harish Rao questions Congress actions, TRS senior leader Harish Rao, TRS merger issue with congress party, Jairam Ramesh, Digvijay Singh, Vijayashanthi joins congress

Harish Rao questions Congress actions, TRS senior leader Harish Rao

కలిసి పనిచెయ్యటమంటే ఇదేనా- హరీష్ రావు

Posted: 02/28/2014 03:20 PM IST
Harish rao questions congress actions

కలిసి పనిచేద్దామనే కాంగ్రెస్ ప్రవర్తన అందుకు అనుగుణంగా లేదని తెరాస సీనియర్ నాయకుడు హరీష్ రావు విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ తెరాస బహిష్కరించిన విజయశాంతిని, ఎమ్మెల్యే అరవింద రెడ్డిని తమ పార్టీలో కలుపుకోవటంతో హరీష్ రావు భగ్గుమన్నారు.  ఇదేనా కలిసి పనిచెయ్యటమంటే అని ప్రశ్నించారు.  ఒక పక్క కెసిఆర్ తన మాట మీద నిలబడివుండాలంటూనే ఇలాంటి పనులు చెయ్యటం సరైనదేనా అని అడిగారాయన.  ఇలాంటి ప్రవర్తన చూపిస్తుంటే కలిసి పనిచెయ్యటం ఎలా సాధ్యం.  మా పార్టీ సభ్యులంతా చాలా అసహనంగా ఉన్నారన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్ లో విలీనం కాకపోతే తెరాసకు ఆఆపా గతే పడుతుందని జైరాం రమేష్ అంతకు ముందు అన్న మాటలను కూడా తప్పు పట్టారు హరీష్ రావు. 

విలీనం చెయ్యనని తెరాస నాయకులు అనలేదు.  మాటకు కట్టుబడే తెలంగాణా ప్రకటన చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ లో విలీనమా లేక కాంగ్రెస్ తో ఎన్నికలలో పొత్తా అన్నది మా సభ్యులతో కూడా చర్చించి చెప్తామనే అంటున్నారు.  మార్చి 1 న పొలిట్ బ్యూరో సమావేశం, లెజిస్లచరీ, పార్లమెంటరీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ పార్టీలతో సమావేశం జరిపి నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నారు.  ఈ లోపులోనే రకరకాల వ్యాఖ్యలు చెయ్యటం, రాజకీయంగా పావులు కదపటం కాంగ్రెస్ పార్టీకి సరైన పద్ధతి కాదని తెరాస నాయకులు అంటున్నారు. 

అయితే ఇవన్నీ ఎన్నికల్లో తెరాస విడిగా పోటీ చెయ్యటానికి వెతుక్కుంటున్న సాకులని చెవులు కొరుక్కునేవారూ ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles