Bjp remembers sardar patel for elections opposition criticizes

bjp remembers Sardar Patel for elections opposition criticizes, Gujarat Chief Minister Narendra Modi, Gujarat MLA Sankar Sinh, Sardar Patel highest statue, Iron man Sardar Patel

bjp remembers Sardar Patel for elections opposition criticizes

ఎన్నికలకోసం గుర్తుకొచ్చిన సర్దార్ పటేల్

Posted: 02/25/2014 01:46 PM IST
Bjp remembers sardar patel for elections opposition criticizes

గుజరాత్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ మీద ప్రతిపక్ష నాయకుడు శంకర్ సింహ్ వాఘలే విరుచుకుపడ్డారు.  గవర్నర్ ప్రసంగం తర్వాత ఓట్ ఆఫ్ థాంక్స్ లో మాట్లాడుతూ శంకర్ సింహ్ భారతీయ జనతా పార్టీకి ఎన్నికల ముందే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకొచ్చారని, అందుకే అతి పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించే పనిలో పడి రాష్ట్రంలోని నిర్మాణాత్మక పనులను విస్మరిస్తోందని అన్నారు.  

లోహపు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 567 చిన్న రాజ్యాలను ఏకం చేసి అఖండ భారత దేశానికి మూలం వేసిన ఘనతను దక్కించుకున్నారు.  అందువలన ఏక్తా కి చిహ్నంగా ఆయన లోహపు విగ్రహాన్ని గుజరాత్ లో నర్మదా నది మీదున్న సర్దార్ సరోవర్ డ్యాంకి అభిముఖంగా ప్రతిష్టించేందుకు భారతీయ జనతా పార్టీ 2010 లో యోజన చేసింది.  దీని ఎత్తు 182 మీటర్లు, పీఠం 58 మీటర్లు వెరసి 240 మీటర్ల ఎత్తైన విగ్రహంగా రూపొందుతోంది.  

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి అనుకరణగా దీన్ని తయారు చేస్తున్నారని, కేవలం ఎన్నికల సమయంలో గుర్తుకొచ్చిన సర్దార్ పటేల్ కేవలం ఎన్నికల వరకే గుర్తుంటారని శంకర్ సింహ్ శాసనసభలో ఎద్దేవా చేసారు.  డ్యాం నుంచి సాగు నీరు రైతులకు చేరే ఏర్పాట్లను పూర్తి చెయ్యలేదు కానీ విగ్రహం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారంటూ శంకర్ సింహ్ ఆరోపించారు.

ఈ విగ్రహం తయారైన తర్వాత ఇదే ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహమౌతుంది.  స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి రెట్టింపు ఎత్తులో తయారవుతోంది సర్దార్ పటేల్ విగ్రహం.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles