Jagdalpur sp shoots to kill family members and himself

Jagdalpur SP shoots family members and himself, Jagdalpur District Additional Judge, Jagdalpur Drunk n drive, Suspended SP kills family and himself

Jagdalpur SP shoots to kill family members and himself

జడ్జ్ తో తలపడి కుటుంబాన్ని, తనను తాను హతం చేసుకున్న ఎస్పీ

Posted: 02/25/2014 12:50 PM IST
Jagdalpur sp shoots to kill family members and himself

మధ్య ప్రదేశ్ జగ్దల్ పూర్ జరిగిన విషాద సంఘటనిది.  40 సంవత్సరాల దేవ్ నారాయణ పటేల్ అక్కడ పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు.  ఆదివారం నాడు అక్కడి అదనపు జడ్జ్ తో జరిగిన వాగ్వివాదం వలన సస్పెండైన దేవ్ నారాయణ తీవ్ర మనస్తాపంతో తన భార్యా పిల్లలను తుపాకీతో కాల్చి, తనను తానూ కాల్చుకున్నారు. 

ఈ సంఘటనలో భార్య భర్తలిద్దరూ మృతి చెందారు.  రాయపూర్ లో చికిత్స పొందుతున్న వాళ్ళ కుమారుడు కుమార్తెల పరిస్థితి విషమంగా ఉంది. 

పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమంలో దేవ్ నారాయణ పటేల్ జిల్లా అదనపు జడ్జ్ ని రోడ్డు మీద ఆపటం జరిగింది.  ఆ సందర్భంగా తన మీద చెయి చేసుకున్నాడని జడ్జ్ చేసిన ఆరోపణ మూలంగా ఎస్పీ ని పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.  దానితో తీవ్ర మనస్తాపానికి లోనైన అతను అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.00 గంటల ప్రాంతంలో తన సర్వీస్ రివాల్వర్ తో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

పోలీస్ శాఖలో ఎంత మానసిక వత్తిడికి లోబడి పని చేస్తున్నారన్నదానికి అద్దం పడుతున్న ఈ సంఘటన అందరినీ కలచివేస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles