తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుప పై ఒక ఫోటో సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తుంది. వి హనుమంతరావు పై కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చేయి చేసుకున్నట్లు కనిపిస్తున్నఫోట్ ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.
దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతరావు పై జైరాం రమేశ్ చేయి చేసుకునే సందర్భంలో.. కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా పక్కనే ఉన్నారు. ఈ ఫోట్ పై హనుమంతరావు అభిమానులు మండిపడుతున్నారు. ఇది నిజమా? లేక ఫోటో మాయా అనే తేల్చుకోలేపోతున్నారు.
అదీ కూడా పార్లమెంట్ ఆవరణలో జరిగినట్లు హనుమంతరావు ముఖంపై చేయిపెట్టి తోస్తున్న జైరాం రమేశ్ ఫోటో ట్విటర్ తోపాటు ఫేస్ బుక్ లో కూడా చర్చనీయాంశమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి నిదర్శనం, జైరాం రమేశ్ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
కానీ జైరాం రమేశ్ సరదాగా హన్మన్నపై చేయివేశారా లేక ఏదో కారణంగా కోపంతో చేయిచేసుకున్నారా అనే విషయం బయటకు రాలేదు. అయితే ఈ విషయం జరిగి కొన్ని రోజులైనట్లు తెలుస్తోంది. ఈ ఫోటో ఆలస్యంగా వెలుగులోకి రావటంతో.. కాంగ్రెస్ పార్టీ లో పెద్ద దుమారం రేపుతుంది.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రస్తాయిలో మండిపడుతున్నారు. వి హనుమంతరావుపై జైరాం రమేశ్ చేయి చేసుకున్నారని @ జన్ లోక్ పాల్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించారు.
ఈ ఫోటో పై హనుమంతరావు గానీ, జైరాం రమేశ్ గానీ, లేకపోతే జేడీ శీలంగాని స్పందించి అసలు అక్కడ జరిగిన విషయం బయటపెడితే గానీ అసలు నిజం బయటకు రాదని హనుమంతన్న అభిమానులు అంటున్నారు. ఏమైన ఇలాంటి ఫోటోలతో..పార్టీ పరువు, నేతల పరువు పోతుందని కొంత మంది సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
ఇలాంటి ఫోటో ను సోషల్ మీడియలో పెట్టినందుకు తగిన చర్యలు తీసుకోవాలని హనుమంతన్న అభిమానులు కోరుతున్నారు. దీనిపై వీహెచ్ ఏమంటారో చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more