V hanumantha rao comment on kiran new party

v hanumantha rao, congress party, kiran kumar reddy, new political party, v hanumantha rao comment on kiran new party, congress party.

v hanumantha rao comment on kiran new party

కిరణ్ వెంట వెళ్లకండి-నట్టేట ముంచుతాడు?

Posted: 02/24/2014 03:46 PM IST
V hanumantha rao comment on kiran new party

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  కొత్త పార్టీ పెట్టే ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం.  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే పార్టీలో ఎవరు చేరకండి? కిరణ్ వెంట వెళ్లకండని.. కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత  తెలంగాణ ఎంపీ అయిన వి హనుంతరావు  కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.   నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వెంట వెళ్లితే  ..నట్టేట మునిగిపోతారని  హనుమంతరావు అంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లే దొంగలంతా  కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో  చేరుతారని అంటున్నారు.  ఇప్పటికే  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  సీమాంద్ర ప్రజలను ఘోరంగా  మోసం చేశాడని  ఆయన ఆరోపించారు.  అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి  నాయకులు వెళ్లిపోతే..   వారిస్థానల్లోకి   పార్టీలో  చురుగ్గా  పనిచేచసిన కార్యకర్తలు  వస్తారని  వీహెచ్ అన్నారు. 

అయితే  హైదరాబాద్ లో  ఉన్న సీమాంద్ర వాళ్లకి  ఎలాంటి భయం వద్దని, అందరం కలిసే ఉందామని, మీకు ఎలాంటి     నష్టం , తెలంగాణ నేతల నుండి  ఉండదని  వీహెచ్ అన్నారు.  సీమాంద్ర వాళ్లు  హాయిగా హైదరాబాదులో వ్యాపారం, ఉద్యోగాలు  చేసుకోవచ్చు.  వారికి మా తెలంగాణ ప్రజలు, తెలంగాణ నేతలు  పూర్తి సహకరం అందిస్తారని  వీహెచ్ అన్నారు. కానీ సీమాంద్ర నేతల  మాటలకు మాత్రం మోసపోవద్దని.. ఆయన మరోసారి గుర్తు చేశారు. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles