Trs merger issue still being dodged by kcr

TRS merger issue still being dodged by KCR, Telangana Rashtra Samiti, K Chandrasekhara Rao, KCR meets Sonia Gandhi, Digvijay Singh, Telangana state, Bharatiya Janata party

TRS merger issue still being dodged by KCR

విలీనం విషయంలో ఇంకా సాగదీస్తున్న కెసిఆర్

Posted: 02/23/2014 04:31 PM IST
Trs merger issue still being dodged by kcr

ఆదివారం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు భేటీ అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తాను కేవలం తెలంగాణా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెల్పుకోవటానికి వెళ్ళానే తప్ప రాజకీయాంశాల గురించి సంప్రదింపులకు పోలేదని అన్నారు.  అయితే ఇతర విషయాలలో సంప్రదింపులకు పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ తనతో టచ్ లో ఉంటారని చెప్పారు. 

కానీ పార్టీ నాయకులు మాత్రం తెరాసా విలీనం కాంగ్రెస్ లో జరుగుతుందనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. 

60 సంవత్సరాల నుంచి తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆశిస్తున్నా, 10 సంవత్సరాల నుంచి కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని పెట్టి నడిపించినందువలనే ఉద్యమం ఉధృతరూపాన్ని తీసుకుని పరిస్థితిని ఈ మేరకు తీసుకునివచ్చింది.  అందువలన తెలంగాణా ఉద్యమానికి తెరాసకు బంధం ఏర్పడటమే కాకుండా తెరాస ఉద్యమానికి ప్రతిరూపమనే అభిప్రాయం ఏర్పడింది.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతున్న తెలంగాణా రాష్ట్రంలో ఆధిపత్యం సంపాదించాలంటే తెరాసతో కలవక తప్పని పరిస్తితి కాంగ్రెస్ పార్టీది. 

దానికితోడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రోజురోజుకీ పుంజుకుంటోంది.  ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాలలో తన పట్టును పోగొట్టుకుంది.  రెండు శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి కంచుకోట అనుకుంటున్న ఢిల్లీ ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎగరేసుకుపోయింది.  అటువంటప్పుడు తన బలాబలాలను సమీకరించుకునే యత్నంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా మీద ఆశపెట్టుకోవటం సహజమే. 

కానీ ఆ పార్టీకి దురదృష్ట వశాత్తూ భాజపా కూడా తెలంగాణా ఏర్పాటులో భాగస్వామ్యాన్ని ప్రకటించుకుంటోంది, ఆ సత్యం సుస్పష్టంగా కనపడుతోంది.  ఎందుకంటే భాజపా మద్దతు లేకుండా తెలంగాణా బిల్లు పాసవటమన్నది అసాధ్యమన్నది అందరికీ తెలుస్తూనేవుంది.  సీమాంధ్ర ఎలాగూ కాంగ్రెస్ చేతుల్లోంచి జారిపోయింది.  అందువలన తెరాస విలీనం కానీ కనీసం ఆ పార్టీతో పొత్తు కానీ కాంగ్రెస్ కి అనివార్యమైపోయింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles