Pakistan is worried about me says narendra modi

Pakistan is worried about me says Narendra Modi, BJP Prime Ministerial candidate Narendra Modi, Modi visits North Eastern states, Election campaigns of Narendra Modi, Modi visits Assam Arunachal and Tripura

Pakistan is worried about me says Narendra Modi

పాకిస్తాన్ కి నా వలన అలజడి- నరేంద్ర మోదీ

Posted: 02/23/2014 11:08 AM IST
Pakistan is worried about me says narendra modi

ఎన్నికల ప్రచారంలో అస్సాం, అరుణాచల్ త్రిపురలో శనివారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలలో భాజపా అధికారంలోకి వచ్చి ఆయన ప్రధానమంత్రైన పక్షంలో ఆయన అవలంబించే ఫారిన్ పాలసీ ఏమిటో కూడా అర్థమౌతోంది.  
అస్సాంలో సిల్చార్ లో మాట్లాడుతూ, అస్సాం ని ఆనుకుని బంగ్లాదేశ్ ఉంది, గుజరాత్ ని ఆనుకుని పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ వలన అస్సాం ప్రజలు చికాకులు పడుతున్నారు, గుజరాత్ లో ఉన్న నా వలన పాకిస్తాన్ లో అలజడి రేగుతోంది అని అన్నారు.  భారత దేశంలో జరుగుతున్న ఎన్నికలను పొరుగు దేశమైన పాకిస్తాన్ పరిశీలనగా చూస్తోందని మోదీకి తెలుసు.  ఈ ప్రకటన వలన సరిహద్దుల్లో పాకిస్తాన్ అప్రమత్తంగా ఉంటారని కూడా ఆయనకు తెలుసు.  పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో పర్యటించేటప్పుడు మోదీ బహుశా పాకిస్తాన్ కి మరిన్ని హెచ్చరికలు మరింత ఘాటుగా ఇవ్వవచ్చు.  
అరుణాచల్ పాసిఘాట్ లో ప్రసంగిస్తూ నరేంద్ర మోదీ, కాలం మారింది, రాజ్యాలను విస్తరింపజేసుకునే సంప్రదాయమూ మారిపోయింది.  ఈ సంగతి తెలుసుకుని చైనా తన పద్ధతిని మార్చుకోవలసివుంటుందని అన్నారు.  రాజ్యాన్ని విస్తరింపజేసుకోవటంలో కాక చైనా అభివృద్ధి పథంలో నడవాల్సివుంటుందని కూడా మోదీ అన్నారు.  అరుణాచల్ భారత భూభాగంలో భాగమని, ప్రపంచంలోని ఏ శక్తీ దాన్ని భారత్ నుంచి వేరు చేయలేదని ఆయన అన్నారు.  అందుకు అనుగుణంగా అరుణాచల్ వాసులు కూడా జైహింద్ నినాదంతో రాష్ట్రంలో దేశభక్తిని మారుమోగేట్టుగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చైనాతో ఎటువంటి భయమూ లేదని అన్నారు.  
దేశభక్తిని చాటుతూ భరతభూమి మీద శపథం చేస్తూ ఉద్వేగంతో, ఈ దేశానికి నష్టం ఎవరూ చెయ్యకుండా తాను పోరాడతానని వాగ్దానం చేసారు మోదీ.  
అస్సాం, అరుణాచల్, త్రిపుర ఈ మూడు ప్రాంతాలలో ఉన్నలోక్ సభ స్థానాలు 25.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles