Rahul joins aap

Rahul joins AAP, Rahul Gandhi, Rajmohan Gandhi, Arvind Kejriwal, Sonia Gandhi, Youth Congress leaders, BJP Narendra Modi

Rahul joins AAP, Rahul Gandhi, Rajmohan Gandhi, Arvind Kejriwal

ఆఆపా లో చేరిన రాహుల్ గాంధీ

Posted: 02/21/2014 04:51 PM IST
Rahul joins aap

"రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరార". 

ఈ వార్తను ప్రముఖ పత్రికలో చదివిన రాహుల్ గాంధీ తను ఇంతపని చేసాడా అని ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే ఆఆపా నుండి కొరియర్ లో ఆఆపా టోపీ ఆయనకు చేరుకుంది. 

రాహుల్ దుడుకుతనం తెలిసిన సోనియా గాంధీ అలా ఎందుకు చేసావని ప్రశ్నించలేదు.  ఎప్పటి లాగానే రాహుల్ ని సమర్థించటం మొదలుపెట్టారామె.  ఇక పార్టీ యువతంతా కూడా రాహుల్ కీర్తిని శ్లాఘించటం

మొదలుపెట్టారు.  రాయల్ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ సాధారణ మానవమాత్రుడైపోయారు.  ఆయన కారు మీద ఎర్రబుగ్గను తీసేసారు.  పోలీలువు భద్రతను ఉపసంహరించుకున్నారు.  ఆయన నివాసాన్ని సాధారణ గృహానికి మార్చివేసారు. 

ఆమ్ ఆద్మీ అన్నది అసలు నా నినాదం.  దాన్ని కేజ్రీవాల్ తస్కరించారు అన్నారు రాహుల్ గాంధీ.  అయినా తానిపుడు ఆపార్టీలోనే చేరుతున్నందువలన దాన్ని విమర్శించటం తగదని వెంటనే ఆయన అభిప్రాయపడి, లోపలికి పోయి ఎవరికీ తెలియకుండా నాలిక కొరుక్కున్నారు.   

రాష్ట్రపతి పాలనను ఉపసంహరింపజేసి తిరిగి ఆఆపా కు అధికారం ఆఆపా లో కొత్తగా చేరిన రాహుల్ కి ముఖ్యమంత్రి పదవినిప్పించటానికి సోనియా ఉత్సుకత చూపిస్తున్నారని తెలుసుకున్న క్యాబినెట్ మంత్రులు అందుకు వేదికను సిద్ధం చెయ్యటం మొదలుపెట్టారు.

రాహుల్ వస్తానంటే మేం వద్దని అనం, కానీ అధికారం కోసం మాత్రం రావద్దని కేజ్రీవాల్ మీడియా ముఖంగా ప్రకటించారు. 

చూసారా ఆ రెండు పార్టీలూ ఒకటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అన్నారు భాజపా ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్ర మోదీ.  మిగిలిన పార్టీలు కూడా యధాశక్తి విమర్శలు కానీ లేదా పొగడ్తలు కానీ వెదజల్లాయి. 

ఇంతలో రాహుల్ ఆఆపా లో చేరుతున్నారన్న వార్తను  రాసిన ఆ ప్రముఖ పత్రికలోని ప్రూఫ్ రీడర్ జరిగిన తప్పును బయట పెట్టగా పత్రికా సంపాదకుడు జరిగినదానికి క్షమాపణ కూడా కోరారు. 

అయితే జరిగిన తప్పేమిటంటే ఆఆపా లో చేరుతున్నది సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కాదని, మహాత్మా గాంధీ మనుమడు రాజ్ మోహన్ గాంధీ అని ప్రచురించారు. 

పైగా, ఆయన ఇంకా ఆఆపా లో చేరలేదు చేరదామనుకుంటున్నారు.  అందుకు ఆఆపా నుంచి ఆయనను కోరిన వారు, మాటలు సాగిస్తున్నవారెవరో ఆయన బయట పెట్టలేదు.  కానీ ఎన్నికలలో నిలబడదామని మాత్రం అనుకుంటున్నట్టుగా చెప్పారు.  పూర్వం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అమేతీ నుండి రాజీవ్ కి పోటీగా ఎన్నికలలో నిలబడ్డారు.  ఈ సారి ఏదైనా పార్టీ ద్వారా ఆ పని చేద్దామనుకుంటున్నారు.  కానీ ఆయన మాత్రం రాజ్ మోహన్ గాంధీయే కానీ రాహుల్ గాంధీ కాదు అని ఆ పత్రిక వివరణనిచ్చింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles