21 cm posts held by 16 cms for ap state

Andhra Pradesh History, Andhra Pradesh Chief Ministers,21 CM posts held by 16 CMs for AP State, First CM Neelam Sanjeevaiah, Last CM Kiran Kumar Reddy, Longest ruled CM Chandrababu Naidu, Shortest ruled CM Nadendla Bhaskara Rao

Andhra Pradesh History, Andhra Pradesh Chief Ministers, 21 CM posts held by 16 CMs for AP State, First CM Neelam Sanjeevaiah, Last CM Kiran Kumar Reddy

21 ముఖ్యమంత్రులు 16 మంది నాయకులు

Posted: 02/21/2014 03:43 PM IST
21 cm posts held by 16 cms for ap state

ఆంధ్రప్రదేశ్ ని 21 ముఖ్యమంత్రులు పాలించగా అందులో నీలం సంజీవ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి రెండు రెండు సార్లు ఆ పదవిని పొందగా ఎన్ టి రామారావు మూడుసార్లు ఆ పదవిన చెపట్టారు.  అందువలన ముఖ్యమంత్రులు 21 మందైనా ఆ పదవులను అలంకరించినవారు 16 మందే.  వాళ్ళు వరుసగా,

1. నీలం సంజీవ రెడ్డి,

2. దామోదరం సంజీవయ్య,

3. నీలం సంజీవ రెడ్డి,

4. కాసు బ్రహ్మానంద రెడ్డి,

5. పివి నరసింహారావు,

6. జలగం వెంగళరావు,

7. మర్రి చెన్నా రెడ్డి

8. టంగుటూరి అంజయ్య,

9. భవనం వెంకటరామిరెడ్డి,

10. కోట్ల విజయ భాస్కర రెడ్డి,

11. ఎన్టీ రామారావ్

12. నాదెండ్ల భాస్కర రావు,

13. ఎన్టీ రామారావు

14. మర్రి చెన్నా రెడ్డి,

15. నేదురుమల్లి జనార్దన రెడ్డి,

16. కోట్ల విజయ భాస్కర రెడ్డి,

17. ఎన్టీ రామారావు,

18. ఎన్ చంద్రబాబు నాయుడు,

19. వై యస్ రాజశేఖర రెడ్డి,

20. కొణిజేటి రోశయ్య,

21. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి.

పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా చేసి దిగిపోయిన తర్వాత జనవరి 11 1973 నుంచి జనవరి 10 1974 వరకు సంవత్సర కాలం పాటు రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది.  ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర పతి పాలన విధిస్తే ఇది ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో రెండవసారి అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 3378 రోజులు చంద్రబాబు నాయుడు ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించగా, నాదెండ్ల భాస్కర రావు అతి తక్కువ కాలం 31 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.  

చంద్ర బాబు నాయుడు తర్వాత రెండవ స్థానంలో 2777 రోజులు అధికారంలో ఉన్న ముఖమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆ తర్వాత మూడు సార్లు అధికారంలో ఉన్న మొత్తం 2751 రోజులు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నఎన్టీ ఆర్ మూడవ స్థానాన్ని అలంకరిస్తారు. 

పై ముఖ్యమంత్రులలో 9 మంది రాయల సీమ నుండి వచ్చినవారు, 5 గురు ఆంధ్రా ప్రాంతం నుండి, ఇద్దరు తెలంగాణా నుండి వచ్చినవారు.  ముగ్గురు తెలుగు దేశం పార్టీ వారైతే మిగిలిన 13 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే. 

నవంబర్ 1 1956 లో ప్రారంభమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తానం ఇప్పటి వరకు చూసుకుంటే  58 సంవత్సరాలలో అంటే, (5 తో భాగిస్తే) 12 టెర్మ్ లలో మొత్తం 21 మంది ముఖ్యమంత్రుల ఏలుబడిలో గడిచింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles