Us woman married agra auto driver killed

us-woman-married-agra-auto-driver-killed, Erin White, Bunty Sharma, US woman killed in Agra, bunty sharma blows himself with gas cylinder

us-woman-married-agra-auto-driver-killed, Erin White, Bunty Sharma

ఆటో డ్రైవర్ ని ప్రేమించి ప్రాణాలు పోగొట్టుకున్న అమెరికన్ మహిళ

Posted: 02/21/2014 02:55 PM IST
Us woman married agra auto driver killed

ఇది హిందీ సినిమా కథ కాదు.  వాస్తవం. 

ఆగ్రాలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న బన్టీ శర్మను అమెరికన్ ఎరిన్ వైట్ వివాహమాడింది.  ఇతర అమెరికన్ మహిళలతో పాటు భారత్ పర్యటనకు వచ్చిన 35 సంవత్సరాల ఎరిన్ వైట్ బన్టీ శర్మను ప్రేమించి వివాహం చేసుకుంది.  భారతీయ సంస్కృతి పట్ల మోజు, సమాజ సేవలో అభిరుచి గల వైట్ వివాహం తర్వాత కిరణ శర్మగా పేరు మార్చుకుని, ఆగ్రా నగరంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దటానికి నడుం కట్టారు.  సుందరమైన నగరం ఆగ్రా అనే పేరుతో ఆమె ఆగ్రాలో మురికి లేకుండా చేద్దామని చెపట్టిన కార్యక్రమాలకు ఎన్నో స్వచ్చంద సంస్థలు మద్దతు ప్రకటించాయి. 

అయితే ఆమె బన్టీ నడుపుతున్న ఆటోలో కత్తితో పొడవగా మరణించింది.  ఆ తర్వాత ఆమె శవాన్ని ఆటోనుండి బయటకు పడేయటమైంది.  పోలీసులా శవాన్నిరాత్రి 8.00 గంటలు కనుగొన్నారు. 

పోలీసుల కథనం ప్రకారం తన అమెరికన్ భార్యను చంపిన తర్వాత బన్టీ శర్మ సంజయ్ నగర్ లో ఉన్న తన నివాసానికి తిరిగివచ్చాడు.  ఆ తర్వాత గ్యాస్ సిలెండర్ వాల్వ్ ని తెరిచి బయటకు వస్తున్న గ్యాస్ తోపాటు కాలిపోయి బూడిదైపోయాడు. 

ఈ విషయాన్ని పోలీసులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, అమెరికన్ ఎంబసీకి తెలియజేసారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధంలో వచ్చిన పొరపచ్చలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.  వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాల వలన వాళ్ళిద్దరూ సైక్రియాట్ దగ్గర సలహాలు కూడా తీసుకున్నారట.  ఆ సైక్రియాట్రిస్ట్ వాళ్ళిద్దరికీ సలహా ఇచ్చి హాయిగా జీవితాన్ని సాగించండని చెప్పాడట. 

యోగాలో కూడా ప్రతిభ ఉన్న ఎరిన్ వైట్ ఆగ్రాలో మూడు అంశాల మీద దృష్టి సారించారట.  ఒకటి నీరు, రెండు చెత్త, మూడు ప్లాస్టిక్ ఉపయోగం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles