One year to dilsukhnagar blasts

one year to dilsukhnagar blasts, Twin blasts Konark theater, Manmohan Singh, One year to Dilsukhanagar twin blasts, CC Cameras in Hyderabad for protection

one year to dilsukhnagar blasts, Twin blasts Konark theater, Manmohan Singh

దిల్ సుఖ్ నగర్ ఘటనకు సంవత్సరం నిండింది

Posted: 02/21/2014 08:54 AM IST
One year to dilsukhnagar blasts

సరిగ్గా సంవత్సరం క్రితం అంటే ఫిబ్రవరి 21, 2013 న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన జంట పేలుళ్ళు సంభవించాయి. 

17 మంది మరణానికి, 138 మంది గాయాల పాలవటానికి కారణమైన జంట పేలుళ్ళు సాయంత్రం 6.45 కి బాగా రద్దీగా ఉండే సమయంలో కోణార్క్ దిల్ సుఖ్ నగర్ థియేటర్ సెంటర్లో పిలిన బాంబు పేలుడులో జరిగిన నష్టానికి ప్రధానమంత్రి తో సహా దేశంలో నాయకులందరి దగ్గర్నుంచీ ఖండన జరిగింది. 

ఘటనను ఖండించటం, బాధితులుకు, వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించటం జరిగింది, దర్యాప్తు సాగుతోంది.  కానీ గాయాలు మానినా మచ్చలింకా పోలేదు.  ప్రజలలో భయం వీడలేదు.  అందుకు కారణం భద్రతా విషయంలో ఆ తర్వాత కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.  అదే తరహాలో నగరంలో మరో పదహారు చోట్ల రెక్కింగ్ జరిగిందని నిఘా వర్గాలు ఎలుగెత్తి చాటినా ప్రభత్వం పోతున్న మొద్దు నిద్ర వీడటం లేదు. 

హింసా కాండకు అవకాశమున్న చోట్ల సిసి కేమెరాలను అమర్చే పని అటకెక్కినట్లు కనిపిస్తోంది.  ఘటన జరిగిన వేడిలో నగరంలో నాలుగు వేల కేమెరాలను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం 40 కెమెరాలను కూడా నెలకొల్పలేదు.  పోలీసుల నిర్లక్ష్య ధోరణి వలన ఆ రోజుకి ఈ రోజుకీ ఏమీ తేడా లేదు.  సిసి కేమెరాల కోసం 425 కోట్ల రూపాయలను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం రాజకీయ లబ్ధికి అవకాశమున్న మిగిలిన పనులను చేపట్టింది కానీ భద్రత విషయంలో మిన్నకుంది. 

రాష్టంలో నిఘా నామమాత్రం కూడా లేదు.  నగరంలో ఇంకా ఉగ్రవాదులు తిరుగుతూ వున్నా సరే ఎవరికీ తెలియదు.  వాళ్ళ కదలికలను కనిపెట్టే నాధుడే లేడు.  బాధితుల కుటుంబానికి ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం ఇతర కార్యక్రమాలలో వ్యస్థమైంది.  కొందరికి పనిచేసే సామర్థ్యం పోయింది.  కొందరి వ్యాపారాలు దెబ్బ తిని వాళ్ళు ఇంకా ఏమి చెయ్యాలో అర్థంకాని పరిస్థితి.  బాధితులలో ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ.  కానీ ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చలేదు.  మరోసారి అటువంటి సంఘటన జరగదనే భరోసా కూడా లేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles