Cm post race in ap congress leaders

congress leaders, cm post, congress party, seemandhra leaders, telangana leaders, com post race, Congress Leaders Race For CM Seat

cm post race in ap congress leaders

ఆ నలుగురు .. ఆ కుర్చీ కోసమే?

Posted: 02/20/2014 04:46 PM IST
Cm post race in ap congress leaders

రాష్ట్రంలోని రాజకీయాలు  ఎటు పోతున్నాయే ఎవరికి అర్థం కావటంలేదు.  నిన్నటి వరకు  రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  సపోర్టు  చేసి, సమైక్యంద్ర కు మద్దతుగా ఉన్న  ఆ నలుగురే,  సీఎం పదవికి రాజీనమా చేసిన వెంటనే  ..ఆ  కుర్చీ మీద కర్చీఫ్ వేయటానికి  సిద్దమవుతున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనిపించుకోవాలని ఉబలాటపడుతున్న రాష్ట్ర మంత్రులు ఆనం, కన్నా, బొత్స, రఘువీరా రెడ్డి గవర్నర్ నరసింహన్ తో భేటీ ఆయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించనుందనే వార్తల నేపథ్యంలో వీరు గవర్నర్ ను కలిశారు.

అయితే కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటూ రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే పాలనాపగ్గాలు చేతిలోఉండడమే మేలని మంత్రులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నలుగురిలో  ఎవరు సీఎం పదవిని దక్కించుకుంటారో తెలియదు గానీ, రాష్ట్రం ప్రజల్లో  మాత్రం  తీవ్రమైన ఉత్కంఠత నెలకొని ఉంది. సీమాంద్ర  నుండి ఈ  నలుగురు పోటీ పడితే..  తెలంగాఱ ప్రాంతం నుండి  మరో నాలుగురు సీఎం ఛైర్  కోసం  ఢిల్లీ లో రాజకీయం చేస్తున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles