Rajya sabha panel chairman renuka chowdary

renuka chowdary, Rajya sabha, telangana bill, Rajya sabha panel chairman renuka chowdary, bjp, congress party.

Rajya sabha panel chairman renuka chowdary

రాజ్య సభ చైర్మన్ సీట్లోరేణుక చౌదరి-టి-బిల్లు పై రచ్చ

Posted: 02/20/2014 04:12 PM IST
Rajya sabha panel chairman renuka chowdary

ఖమ్మం జిల్లా ఫైర్  బ్రాండ్  రేణుక చౌదరి పేరు తెలియని  వ్యక్తులు ఎవరు ఉండురు.  అలాగే ఈరోజు ఒక అరుదైన ఘట్టం రాజ్య సభలో  జరిగింది. ఛైర్మన్ సీట్లో రేణుకా చౌదరి కూర్చున్నారు.

సభ 15 నిమిషాలు వాయిదా పడిన అనంతరం, సభ ప్రారంభమైంది. ప్యానెల్ ఛైర్ పర్సన్ గా రేణుకా చౌదరి సభాధ్యక్షురాలిగా వ్యవహరించి... సభ సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు చేరుకున్నారు. అంతకు ముందే రాజ్యసభలో హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణ బిల్లుకు సంబంధించి ప్రధాని కొన్ని ప్రకటనలు చేయనున్న నేపథ్యంలో, ఆయన రాజ్యసభకు చేరుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సీమాంధ్రకు న్యాయం చేయడం రెండూ సాధ్యమేనని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ బీజేపీ తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారని... కానీ అది అవాస్తవమని, తాము తెలంగాణ బిల్లుకు మద్దతిస్తున్నామని అన్నారు.

రాజ్యసభలో తెలంగాణ బిల్లులోని రాజ్యాంగ అంశాలపైనే అరుణ్ జైట్లీ చర్చిస్తారని ఆయన స్పష్టం చేశారు. తాము రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles