Bjp surprise move on telangana bill

BJP surprise move on Telangana bill, Arun Jaitley, MPs suspended from Parliament, Debate on state reorganization bill

BJP surprise move on Telangana bill, Arun Jaitley

తెలంగాణా మీద భాజపా సర్ ప్రైజ్ మూవ్

Posted: 02/17/2014 10:07 AM IST
Bjp surprise move on telangana bill

సీమాంధ్ర ఎంపీలు లేకుండా పార్లమెంట్ లో బిల్లు మీద చర్చా?  సీమాంద్ర ఎంపీలను బహిష్కరించి, అది కూడా ఐదు రోజుల వరకు అంటే రాష్ట్ర విభజన బిల్లు కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లు ఆమోదించబడేంత వరకు సస్పెండ్ చేసి బిల్లు మీద చర్చ ఎలా సాధ్యమని భాజపా పార్లమెంటు బోర్డ్ సమావేశంలో చర్చనీయాంశమైంది.  అరుణ్ జైట్లీ లేవనెత్తిన ఈ అంశం ఆ సమావేశంలో ప్రముఖంగా చోటుచేసుకుంది. 

రాష్ట్ర విభజననేది కీలకమైన అంశం.  దానికి అభ్యంతరాలను తెలుపుతున్న ఎంపీలను బహిష్కరించి బిల్లు మీద ఇక ఎవరితో చర్చిస్తారన్నది భాజపా నాయకుల వాదన.  ఒకపక్క గొడవ జరుగుతుంటే రాష్ట్ర విభజన బిల్లుని హడావిడిగా ప్రవేశపెట్టామని చెప్పటమేమిటని కూడా ఈ రోజు లోక్ సభలో ప్రశ్నించటానికి భాజపా నిర్ణయించుకుంది. 

అయితే ఇవన్నీ ఇలా ఉన్నా అసలు తెలంగాణా బిల్లు మీద భాజపా ఏం చెయ్యబోతున్నారన్నది గోప్యంగా ఉంచారు ఆ నాయకులు.  సమావేశం అనంతరం భాజపా నాయకులెవరూ మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు.  అంటే పార్లమెంట్ లో వాళ్ళది సర్ ప్రైజ్ మూవ్ అవుతుందన్నమాట. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles