Introduction of a bill became challenge to govts

Introduction of a bill became challenge to Govts, Arvind Kejriwal, Jan Lokpal Bill, Swaraj Bill, Delhi Assembly

Introduction of a bill became challenge to Govts

ప్రభుత్వాలకు పెను సవాల్ బిల్లులను ప్రవేశపెట్టటం!

Posted: 02/14/2014 11:41 AM IST
Introduction of a bill became challenge to govts

జన్ లోక్ పాల్ బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టలేకపోతే రాజీనామా చేసి గద్దె దిగిపోతానంటూ ఆఆపా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

ఆఁ.. ఒకవేళ భాజపా కాంగ్రెస్ పార్టీలు అందులోని అంశాల మీద చర్చ జరిపి, వ్యతిరేకించి నట్లయితే ఓకే.  కానీ అసలు బిల్లునే ప్రవేశపెట్టనీయకపోతే మాత్రం రాజీనామా చేస్తానంటూ ఎందుకంటే అసలు వచ్చిన లక్ష్యమే నెరవేరకపోతే రాజీనామాయే శరణ్యం అన్నారు కేజ్రీవాల్. 

జన్ లోక్ పాల్, స్వరాజ్ బిల్లులను తీసుకునివచ్చి అవినీతితో పోరాటం సల్పటం కోసమే అధికారంలోకి వచ్చామని, అందువలన ఆ పని చెయ్యలేకపోతే గద్దె దిగిపోవటమే సరైన చర్యని కేజ్రీవాల్ అన్నారు. 

చరిత్రలో మొదటిసారిగా భాజపా కాంగ్రెస్ పార్టీలు ఒకే తాటి మీదకు వచ్చాయని, సభను జరగనివ్వకపోవటమే వాళ్ళ లక్ష్యమని కేజ్రీవాల్ అన్నట్టుగానే, ఆ రెండు పార్టీల నాయకులు మాటిమాటికీ ఆఆపా స్పీకరైన ధిర్ దగ్గరకు పోయి మైకు తమవైపు తిప్పుకుని తమతమ నినాదాలను వినిపించారు. 

బిల్లులను ప్రవేశపెట్టటమే ప్రభుత్వానికి పెనుసవాలుగా మారిన రోజులివి.  బిల్లులను ప్రవేశపెట్టటం, పాస్ చేయించుకోవటం మీద ప్రభుత్వం విజయం ఆధారపడుతోంది,  వాటిని అడ్డుకోవటం ప్రతిపక్షాలు తమ విజయాలుగా భావిస్తున్నాయి.  అది శాసన సభే కావొచ్చు లేదా లోక్ సభే కావొచ్చు కానీ సన్నివేశమైతే అదే.  ప్రజాహితమైన చట్టాలను ఎలా తీసుకుని రావాలి అని కాకుండా, చర్చల ద్వారా సరైన నిర్ణయాలకు రావాలని కాకుండా, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సంక్షేమం కోసం కాకుండా కేవలం పార్టీని బలోపేతం చేసే విధానాలేమిటా అని మాత్రమే ఆలోచించటం జరుగుతోంది, బయటకు వచ్చిన తర్వాత తమ భాషా పటిమతో తమ తమ వాదనలను గట్టిగా వినిపించటం వైరి పక్షాలను తూలనాడటం జరుగుతోంది. 

అందువలన ఆఆపా నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ శాసనసభలో జన్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టటానికి మార్గాంతరంగా రాజీనామా చేస్తానని హెచ్చరిస్తున్నారు.  దీనితో ఆ బిల్లు కోసమే పదవీ త్యాగం చేసిన ఘనత ఆయనకెక్కడ దక్కుతుందోనన్న భయంతోనైనా బిల్లును ప్రవేశపెట్టటానికి సహకరిస్తారని కేజ్రీవాల్ ఎత్తుగడ.  అందుకే, కావాలంటే చర్చలో పాల్గొని దాన్ని ఓడించండి అని సవాల్ విసిరారాయన.  అలా చేస్తే అవినీతికి కాపుకాస్తున్నారనే అపనింద మొయ్యవలసిన అగత్యం ఏర్పడవచ్చు కాబట్టి అప్పుడు దాన్ని ఆమోదించటానికి సహకరిస్తారని ఆయన ఆలోచన.

మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మంచి పని చెయ్యాలన్నా రాజకీయాలలో ఎత్తుకు పై ఎత్తులు వెయ్యక తప్పటం లేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles