Suspension of mps disrupting proceedings in parliament

suspension of MPs disrupting proceedings in Parliament, Suspended MPs strategy, No trust move by suspended MPs, TDP MPs to be suspended for Parliament disruption, BJP stand on T bill

suspension of MPs disrupting proceedings in Parliament

వెలివేసిన ఎంపీల మీద వ్యూహప్రతివ్యూహాలు

Posted: 02/12/2014 09:57 AM IST
Suspension of mps disrupting proceedings in parliament

కేంద్ర ప్రభుత్వం ఆరుగురు ఎంపీల మీద వేటు వేసింది.  అయితే వారంతా ఇప్పుడు పార్టీ అధినాయకత్వంతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా విభజన బిల్లును అడ్డుకోవచ్చని అనుకుంటుండగా వాళ్ళని పార్లమెంటులో నుండి కూడా బహిష్కరించే వ్యూహంలో ఉంది కాంగ్రెస్ పార్టీ.  పార్లమెంటులో రగడ చేస్తున్న తెదేపా ఎంపీలను నలుగురిని కూడా బహిష్కరిస్తే సద్దు మణుగుతుందనే ఆలోచనలో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం.  ఈ పదిమంది బహిష్కరణతో పార్లమెంట్ లో సద్దుమణగటమే కాకుండా ఇతర సీమాంధ్ర మంత్రులు ఈ దారిలో పోరనే నమ్మకం కూడా ఉండబట్టి ఆ విధంగా బిల్లుని ఆమోదింప చేసుకోవటానికి మార్గం సుగమం అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 

అందుకు ప్రతిగా అవిశ్వాసానికి నోటీసులివ్వాలని ప్రభుత్వాన్ని నిర్వీర్యం చెయ్యటానికి మొత్తం 55 మందిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు బహిష్కృత ఎంపీలు.  ఆ దిశగా ఇప్పటివరకు 33 మంది ఎంపీల సంతకాలను సేకరించారు కూడా.  అవిశ్వాస తీర్మానం ఉన్నప్పుడు దాని మీద చర్చ సాగించాలి లేదంటే సభను వాయిదా వెయ్యవలసివుంటుందని వీరంతా గట్టిగా నమ్ముతున్నారు. 

పార్లమెంటు నుంచి సస్పెండ్ చెయ్యటం విషయంలో తీవ్రంగా స్పందించిన సబ్బం హరి, భాజపా 45 రోజులు పార్లమెంటుని సాగనివ్వని తరుణంలో వాళ్ళని ఎందుకు సస్పెండ్ చెయ్యలేదని ప్రశ్నించారు.  తెలంగాణా ఎంపీలు అనేక మార్లు సభను అడ్డుకున్నారన్న విషయాన్ని ఆయన గుర్తుచేసారు.  మేము ఒక్కరమే కాదు మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలు వివిధ సమస్యలను లేవనెత్తి స్పీకర్ వెల్ లోకి వస్తున్నారు.  మమ్మల్ని సస్పెండ్ చెయ్యటానికి ముందు వాళ్ళు రాకుండా కట్టడి చెయ్యాల్సివుంటుందన్నారు సబ్బం హరి. 

ఉండవల్లి నివాసంలో సమావేశమైన బహిష్కృత ఎంపీలు ఎలాగైనా బిల్లుని ఆపాలని వివిధ రకాలుగా వ్యుహరచన చేస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles