T bill in parliament on thursday at 12 noon

T Bill in Parliament on Thursday at 12 noon, Union Finance Minister Chidambaram, Prime Minister feast to BJP, Top leaders in Delhi for bifurcation bill, T Bill in Loksabha

T Bill in Parliament on Thursday at 12 noon

బిల్లుకి సుముహూర్తం రేపు మధ్యాహ్నం 12 గంటలకు

Posted: 02/12/2014 09:19 AM IST
T bill in parliament on thursday at 12 noon

ఎట్టకేలకు లోక్ సభలోకే ప్రవేశించబోతోంది రాష్ట్ర విభజన బిల్లు.      ఇది ఆర్థిక బిల్లు కాదని, దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చని వాదించిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కృషి ఫలించలేదు.  అయితే ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి బిల్లు బడ్జెట్ తర్వాతనే లోక్ సభ బల్ల మీదికి వస్తుంది.

ఈ సందర్భంగా తెలంగాణా సీమాంధ్ర నాయకులంతా రాజధానిలోనే మకాం వేసారు.  బిల్లుని గెలిపించుకోవటానికి, అడ్డుకోవటానికి వ్యూహ ప్రతివ్యూహాలు చురుగ్గా సాగుతున్నాయి.  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, తెరాస అధ్యక్షుడు కెసిఆర్, లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, భాజపా నేతలు ఇతర తెలంగాణా సీమాంధ్ర నేతలు ఢిల్లీలోనే ఉన్నారు.  వారితో పాటు ఉద్యమనేతలు కోదండరామ్, అశోక్ బాబు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. 

బిల్లుని రాజ్యసభలో పెట్టటానికి విశ్వప్రయత్నం చేసి ఓడిపోయిన కేంద్ర ప్రభుత్వం చివరకు లోక్ సభలోనే ప్రవేశపెట్టవలసివస్తోంది.  భాజపాను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రధానమంత్రి ఈరోజు విందు ఇవ్వబోతున్నారు.  భాజపా అగ్రనేతలందరూ హాజరయ్యే ఈ విందులో ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమలనాధ్, ఆర్థిక మంత్రి చిదంబరం, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పాల్గొంటారు. 

అసలు ముందు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టటానికే జివోఎమ్ సభ్యులందరూ సిద్ధమవుతుండగా చిదంబరం మాత్రం రాజ్యసభలో ప్రవేశపెట్టటానికి వత్తిడి తెచ్చారు.  మిగిలినవారు ఆయన మాటను కాదనలేక అంగీకరించారు కానీ చివరకు రాజ్యసభ సెక్రటేరియట్ ఇది ఆర్థిక బిల్లు కిందికే వస్తుందని గట్టిగా చెప్పటంతో చిదంబరానికి వెనక్కి తగ్గవలసివచ్చింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles