అమెరికా దౌత్యాధికారి నాన్సీ పౌవెల్ నరేంద్ర మోదీతో భేటీకి తయారవుతున్నారు. దీనితో అమెరికా ప్రభుత్వానికి మోదీ విషయంలో దిగిరాక తప్పలేదని అర్థమౌతోంది.
2005లో నరేంద్ర మోదీకి అమెరికన్ వీసాను ఇవ్వటానికి నిరాకరించిన స్టేట్ డిపార్ట్ మెంట్ తీసుకున్న నిర్ణయం విషయంలో మాట్లాడుతూ అప్పటి దౌత్యాధికారి డేవిడ్ మల్ఫోర్డ్, 2002 లో గుజరాత్ లో జరిగిన మారణహోమానికి రాష్ట్ర సర్వాధికారిగా ఉన్న నరేంద్ర మోదీ బాధ్యులని అందువలన ఆయన వీసాను రద్దు చేస్తున్నామని చెప్తూ, ఇది కేవలం నరేంద్ర మోదీ కి మాత్రమే వర్తిస్తుందని, నిజానికి ప్రతినెలా వేలాది మంది గుజరాత్ వాసులకు అమెరికా వీసా జారీ చెయ్యటం జరుగుతోందని అన్నారు.
ఆ తర్వాత ప్రతి సంవత్సరం యాంత్రికంగా మోదీ వీసాను తిరస్కరిస్తూ వస్తున్నారు. ఎవరైనా భారతీయుడు అమెరికా పోలేకపోతే అమెరికాయే అతని దగ్గరికి వస్తుందని స్వామి వివేకానంద అన్నట్లుగా నాన్సీ పౌవెల్ భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను పురస్కరించుకుని భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ఎంతో మద్దతు కూడగట్టుకున్న నరేంద్ర మోదీతో భేటీ కోరుతున్నారు. కోర్టు కూడా ఆయన మీదున్న గుజరాత్ అల్లర్ల అబియోగాలన్నిటినీ కొట్టివేసింది.
2005 తర్వత మోదీ అమెరికా వీసా కోసం అప్లై చెయ్యలేదు. మోదీ వీసాకు అప్లై చేసుకోవచ్చునని, అలా చేసినట్లయితే దాన్ని పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం చెప్తూ వస్తోంది కానీ భాజపా సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ కూడా మోదీ వీసా కోసం అప్లై చెయ్యకూడదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
నరేంద్ర మోదీ వీసాను రద్దు చేసినపుడు అమెరికాకు ఆయన స్థాయి ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి కావొచ్చు, సర్వేలు కూడా అందుకు అనుకూలంగానే నివేదికలిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పౌవెల్ కలుద్దామనుకుంటున్నది భావి భారత ప్రధాని కాగల మోదీని.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినట్లయితే ఆ హోదాలో ఆయన అమెరికా పోవటానికి ఆయనకు ఏ బిజినెస్ లేక విజిటర్ వీసా అవసరమూ పడదు. అందువలన నరేంద్ర మోదీ తన అమెరికన్ వీసా గురించి పెద్దగా పట్టించుకున్నట్లుగా కనపడటం లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more