Neurons that create hunger feeling

Neurons that create hunger feeling, Beth Israel Deaconess Medical Center, hunger-inducing neurons, hypothalamus

Neurons that create hunger feeling in the brain

అతిగా ఆకలిని సూచించే న్యూరాన్లతో ఊబకాయం?

Posted: 02/09/2014 04:59 PM IST
Neurons that create hunger feeling

భోజన సమయాల్లో కాక మిగతా సమయాల్లో ఆకలవగానే కిచెన్ లో డబ్బాలు కానీ ఫ్రిజ్ లో కానీ తినుబండారాల కోసం వెతుక్కోవటం జరుగుతుంది.  ఇలాంటి సంకేతాలు కలగటానికి కారణమేమిటన్న దానిమీద పరిశోధన చేసిన శాస్త్రవేత్తలకు మెదడులో కలిగే న్యూరాన్స్ కదలికల అరుదైన సర్క్యూట్ ని కనుగొన్నారు. 

అమెరికాలోని డేత్ ఇజ్రాయల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ లో చేసిన పరిశోధనలో మెదడు లోని హైపోథాలమస్ అనే భాగంలో శరీరంలోని శక్తి క్షీణిస్తున్న సంకేతాలు అందించే న్యూరాన్ల సముదాయం చురుగ్గా కదులుతుందని తెలుసుకున్నారు.  జంతువులలో ఈ న్యూరాన్స్ సహజసిద్ధంగా కానీ లేదా కృత్రిమంగా కదలిక వచ్చేట్టు చేసినా కానీ అవి ఆహారం కోసం వెతకటం మొదలు పెడతాయని ఎలుకల మీద చేసిన ప్రయోగంలో తేలింది. 

విచిత్రంగా ఈ న్యూరాన్స్ ఉన్న చోటు మెదడులో పారా వెంట్రిక్యులర్ న్యూక్లియస్ లో.  ఇంతకాలం దీన్ని జీవానికి తృప్తిని కలిగించే భాగంగా నమ్ముతూ వచ్చారు.  ఇప్పుడు వచ్చిన అవగాహనతో మెదడులోని వైరింగ్ డయాగ్రమ్ ని గీయటమే కాకుండా అసలు మనకు ఆకలి అనే భావనను కలుగజేసేదేమిటన్నది కూడా అర్థం చేసుకోవటానికి పనికివస్తుంది. 

పరిశోదన ఒక ఎత్తైతే దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మరొకటి.  ఆకలి ఎందువలన కలుగుతుంది, ఆహారం కోసం తపించేట్టుగా ఎందుకు చేస్తుందన్న విషయం తెలిసినట్లయితే అవసరానికి మించిన ఆకలి భావన కలిగించే ఊబకాయానికి దోహదపడే దాని విషయం కూడా తెలుసుకోవచ్చును. 

కానీ, ఇప్పటికీ క్లిష్టమైన మెదడు అంతర్భాగంలో ఆకలిని నియంత్రించే విధానం ఇంకా అంతుబట్టలేదంటున్నారు పరిశోధకులు.  ఆకలిని పక్కకు పెట్టి ఉపవాసం చెయ్యటం వలన  తర్వాత తినే ఆహారం తృప్తి విలువను పెంచుతున్నది సత్యం కానీ ఆకలిగా ఉందా లేక పస్తు అవసరమా లేక తినటం అవసరమా అన్నది మెదడు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంకా అర్థం కాలేదని శాస్త్రజ్ఞలు అంగీకరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles