Bjp support to t bill only after studying it

BJP support to T bill after studying, BJP senior leader Venkaiah Naidu, Telangana Bill, Amendments to T Bill by BJP, GoM members, Digvijay Singh, Jairam Ramesh

BJP support to T bill only after studying it says Venkaiah Naidu

బిల్లుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మద్దతు మీద నిర్ణయం

Posted: 02/09/2014 04:19 PM IST
Bjp support to t bill only after studying it

నెల్లూరులో ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు  వెంకయ్యనాయుడు,  తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చేదీ లేనిదీ దాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోబడుతుందని అన్నారు.  బిల్లు మీద రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని కూడా ఆయన అన్నారు.

తెలంగాణా రాష్ట్రానికి కట్టుబడి ఉన్నది నిజమే కానీ ఆంధ్రా రాయలసీమ ప్రాంతాలకు న్యాయం చెయ్యటం కూడా తమ ధర్మమేనన్నారు వెంకయ్యనాయుడు.  తెలంగాణా బిల్లులో కొన్ని నిర్మాణాత్మక సవరణలను సూచించామని, కానీ దాని మీద కేంద్రం ఎటువంటి చర్యా చేపట్టినట్టుగా లేదని వెంకయ్య అన్నారు. 

జివోఎమ్ సభ్యుడు జయ్ రామ్ రమేష్ కి తమ సూచనలను అందజేసామని, అలాగే దిగ్విజయ్ సింగ్ అహ్మద్ పటేల్ కూడా సూచనలిచ్చామని, కానీ వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని, ఏది ఏమైనా బిల్లును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వతనే ఏ నిర్ణయమైనా తీసుకోవటం జరుగుతుందని వెంకయ్య అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles