భారత్ అమెరికా దేశాల మధ్య బలహీనపడ్డ సంబంధాలను పునరుద్ధరించటానికి వైట్ హౌస్ నుంచి పై స్థాయిలో ముందడుగు పడుతోంది. ఒక దౌత్యాధికారి వలన ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు వేస్తున్న అడుగులలో అడ్డంకులు రాగూడదని సంకేతాలు వచ్చాయి.
మాన్ హట్టన్ లో పనిచేస్తున్న దేవయానీ ఖోబ్రాగడే వీసా నియమాలను ఉల్లంఘించారని, ఆమె తన దగ్గర ఇంటిలో పనిచేస్తున్న మహిళ కు చెల్లించవలసిన జీతాన్ని చెల్లించలేదని ఆమెను డిసెంబర్ 12 న అరెస్ట్ చేసి పోలీసు నిర్బంధంలోకి తీసుకుని ఆమె మీద వివస్త్ర తనిఖీలు లాంటి అవమానకరమైన వ్యవహారంతో భారతీయులకు మనస్తాపం కలిగించి ఆమెను కరడుగట్టిన నేరగాళ్ళ మధ్య జైలులో ఉండేలా చేసినందుకు భారత ప్రభుత్వం అమెరికా దేశం పట్ల కటువుగానే ప్రవర్తించింది.
అయితే మన ఇరుదేశాల మధ్యగల సువిశాలమైన సంబంధం దృష్ట్యా చూస్తే, ఇరుదేశాలు కలిసి సాధించగల కార్యాల దృష్ట్యా చూస్తే ఆ సంఘటన చాలా చిన్నదని, మనమధ్య ఉన్న పొరపచ్చలను విశాలమైన నిర్మాణాత్మకమైన దృష్టికోణం నుంచి చూడాలని సాక్షాత్తూ అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ వాషింగ్టన్ లో నిర్వహించిన ఆస్పెన్ ఇన్ స్టిట్యూట్ యుఎస్ ఇండియా డైలాగ్ లో అన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రత, సురక్ష విషయంలో పరస్పర సహకారంతో పనిచేసే దేశాలు రెండూ ఇప్పటివరకూ నిర్మించుకున్న మైత్రీబంధం భవిష్యత్తులో ఇంకా పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నానని సుసాన్ రైస్ అన్నారు. అమెరికా దేశంలో తయారయ్యే ఆయుధాల కొనుగులు చేసే దేశాలలో భారతదేశం ప్రముఖమైనది కాబట్టి మార్కెట్ ను పోగొట్టుకోవటం కూడా అమెరికాకు ఇష్టం లేదని తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా ఇరుదేశాల మధ్య బంధుత్వం మాత్రం బలహీనపడకుండా పటిష్టంగానే ఉంటుందన్న ఆశాభావాన్ని కూడా అమెరికా వ్యక్తంచేసింది. రెండు దేశాలు కలిసి సమిష్టిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more