Cabinet approves ap state reorganization bill

Cabinet approves AP State Reorganization Bill, Union Cabinet approves T bill,

Cabinet approves AP State Reorganization Bill as it is

విభజన విషయంలో పంతం నెగ్గించుకుంటున్న కేంద్రం

Posted: 02/08/2014 07:51 AM IST
Cabinet approves ap state reorganization bill

శుక్రవారం సాయంత్రం క్యాబినెట్ మీటింగ్ లో రాష్ట్ర పునర్విభజన బిల్లుకి ఆమోదముద్ర పడింది. 

ఒక పక్క కమిటీలు, సమావేశాలు, మరో పక్క ఆందోళనలు, సూచనలు, పిటిషన్లు, సభలను అడ్డుకోవటాలు, చివరకు బిల్లుని శాసన సభను తిరస్కరించటం, ఇదంతా జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం విభిజన విషయంలో తాపీగా తను అనుకున్న పని చేసుకుంటూ పోతోంది.  సొంత పార్టీ నుంచి వ్యతిరేకతలు వచ్చినా, ఢిల్లీలో మకాం పెట్టి ఆందోళనలు చేస్తున్నా కేంద్రం దాన్నంతా చిద్విలాసంతో శేషపాన్పు మీద పడుకుని ఉన్న విష్ణుమూర్తిలా సాక్షీభూత స్థితిలో చూస్తూ తను ఆడే ఆట తను ఆడుతోంది.

కేంద్రప్రభుత్వం మొట్టమొదట తయారు చేసిన బిల్లునే యథాతథంగా ఆమోదించి దాన్ని రాష్ట్రపతికి పంపిస్తోంది.  దీన్ని ఈ బిల్లును ఫిబ్రవరి 12న రాజ్యసభలో ప్రవేశపెట్టటానికి సర్వసన్నాహాలు జరుగుతున్నాయి.  

ఇక సవరణల విషయానికొస్తే 32 సవరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది కానీ వాటిని బిల్లులో ఎక్కడా సూచించలేదు.  పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఆ సవరణలను అక్కడే ప్రతిపాదించ దలుచుకున్నది ప్రభుత్వం. 

సవరణలలో ప్రముఖంగా పది సంవత్సరాల కాలం హైద్రాబాద్ ని ఉమ్మడి రాజధానిగాను, గవర్నర్ ని ఉమ్మడి గవర్నర్ గానూ ప్రతిపాదించబోతున్నారు.  భద్రాచలం డివిజన్ లోని ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపనున్నారు.  సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుంది.  రాజధాని నిర్మాణం కోసం అవసరమైన అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చెయ్యటానికి సిద్ధపడుతున్నారు. 

ఇక అడిగినవాటిలో కాదన్నవి, హైద్రాబాద్ లో ఆదాయంలో సీమాంధ్రకు వాటా ఉండదు.  హైద్రాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చెయ్యటం కుదరదు.  రాయల తెలంగాణా లేదు.  రాష్ట్రం నుంచి వెళ్ళిన 9072 సవరణలలో కేవలం 20 మాత్రమే సమంజసంగా ఉన్నాయని కేంద్రం భావించింది.  బిల్లులో స్పష్టంగా రాష్ట్రానికి పంపించింది అభిప్రాయం కోసమేనని, దాని ప్రభావం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద ఎంతమాత్రం ఉండదని తెలియజేయటమైంది.  భవిష్యత్తులో న్యాయపరమైన అభ్యంతరాలు లేకుండా కూడా కేంద్రం జాగ్రత్తలు తీసుకున్నదని దీనితో అర్థమౌతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles