Anuhya abduction and murder case suspect drawing

Anuhya abduction and murder case suspect drawing, Anuhya Esthar murder, Anuhya TCS employee, Anuhya Machilipatnam

Anuhya abduction and murder case suspect drawing

అనూహ్య కేసులో నిందితుడి రేఖా చిత్రం

Posted: 02/07/2014 03:22 PM IST
Anuhya abduction and murder case suspect drawing

ముంబైలో అనూహ్య హత్య కేసులో ఇంతవరకు పోలీసు దర్యాప్తులో దొరికినట్లే అనిపించిన ఆధారాలేమీ నేరస్తుల వరకు చేర్చలేకపోయాయి.  ముందు టాక్సీ డ్రైవర్లమీద అనుమానపడ్డారు.  వాళ్ళు కాదని తేలింది.  తరువాత ఆమె స్నేహితుడికి చేసిన ఫోన్ కాల్స్ వలన అతనిని అనుమానించారు.  అయితే అతను ఆ సమయంలో ముంబైలోనే లేడు.  అందుకు ఆధారాలు చూపించటంతో ఆ దారీ మూసుకుపోయింది. 

ఇక రైల్వే స్టేషన్లో సిసి కేమెరాల ఫుటేజ్ లో లభించిన రైల్వే స్టేషన్లో అనుమానస్పదంగా ప్రవర్తిస్తూ కనపించిన మనిషికోసం గాలింపు మొదలైంది.  అతని చేతిలో మద్యం సీసా, నడకలో మద్యం ప్రభావం కనిపించింది.  సిసి కేమెరాలలో ఎల్ టి టి స్టేషన్లో అనూహ్య వెంట నడిచినట్లుగా కనిపించిన ఆ మనిషి కోసం సమీపంలో మద్యం దుకాణాలలో విచారించి వాళ్ళు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం రేఖా చిత్రాన్ని గీయించిన పోలీసులు ఆ మనిషి వేటలో పడ్డారు. 

అనూహ్య రక్త నమూనాలలో ఫోరెన్సిక్ ల్యాబ్ మద్యం మాదక ద్రవ్యాల ఆనవాళ్ళను గమనించింది.  పైగా ఆ మనిషి అనూహ్య రావటానికి అరగంట ముందు నుంచే అక్కడ వేచి చూస్తూ కూర్చోవటం ఫుటేజ్ లలో కనపించింది.  అంతే కాకుండా ఆ మనిషి అనూహ్యకి తెలిసినవాడే అయ్యుండవచ్చని అందుకే ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అతనితో వెళ్ళివుంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు.  దాని ఆధారంగా అనూహ్యను తీసుకెళ్ళిన మనిషి అతనే అయ్యుంటాడనే ఉద్దేశ్యంతో అతని రేఖా చిత్రాల ఆధారంతో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ముంబై పోలీసులు. 

ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి చెందిన 23 సంవత్సరాల అనూహ్య క్రిస్టమస్ శలవుల తర్వాత తాను ముంబైలో పనిచేస్తున్న టిసిఎస్ కంపెనీలో విధుల్లోకి పోవటం కోసం విజయవాడలో రైలు ఎక్కి జనవరి 5 తెల్లవారు ఝామున ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ లో దిగింది.  ఆ తర్వాత జనవరి 16 న శవంగా దొరికింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles