Two indian women business executives in top 50 globally

Two Indian women business executives in top 50 globally, Fortune magazine, Indra Nooyi Pepsi CEO, ICICI Bank CEO Chanda Kochchar

Two Indian women business executives in top 50 globally

వ్యాపార రంగంలో అగ్రస్థానంలో ఉన్ననారీమణులు

Posted: 02/07/2014 02:38 PM IST
Two indian women business executives in top 50 globally

ప్రపంచ స్థాయిలో వ్యాపార రంగంలో కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుడుతూ మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిన 50 మంది అగ్ర స్థాయి వ్యాపారస్తులలో భారత దేశానికి చెందిన మహిళలు ఇద్దరున్నారు.

ఫార్చూన్ మేగజైన్ వెల్లడి చేసిన ఆ జాబితాలో పెప్సీ కంపెనీ సిఇవో ఇంద్రా నూయీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి చందా కోచర్ ఉన్నారు.  ఆ జాబితాలో పై స్థానాన్ని అలంకరించిన మహిళ జనరల్ మోటార్స్ లో సిఇఓ గా ఉన్న మేరీ బర్రా ఎలక్ట్రకిల్ ఇంజినీరు చేసి తన కెరీరంతా ఆ కంపెనీకే అర్పించారు.  ఆమె ప్రపంచ వ్యాప్తంగా 212000 మంది ఉద్యోగులకు అధిపతి.  

మూడవ స్థానంలో ఉన్న భారత దేశానికి చెందిన 58 సంవత్సరాల నూయీ గత ఏడు సంవత్సరాలుగా భారత దేశంలోని పెప్సీ కంపెనీలో పనిచేస్తూ అమ్మకాలను రెట్టింపు చేసారు.  65.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయంలో ఉన్న ఈ సంస్థలో ఇతర విదేశీ పానీయాల సంస్థలు కేవలం సగమే సాధించాయి.  

ఇక 18 వ స్థానంలో ఉన్న భారతీయ మహిళ 52 సంవత్సరాల కోచర్, భారత దేశంలో 124 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన ఆస్తులు, 3588 శాఖలతో పనిచేస్తూ 1.5 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో దేశంలో రెండవ స్థానంలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ లో పనిచేస్తున్నారు.  ఈ బ్యాంక్ మొత్తం 19 దేశాలలో శాఖలను విస్తరింపజేసి విదేశవాసుల భారతదేశంలోని కుటుంబ సభ్యులకు సొమ్ము బదిలీ చేస్తోంది.  

ఏ రంగంలోనైనా మహిళలు విజయాన్ని సాధించగలరని నిరూపిస్తూ మహిళలకు స్పూర్తిదాయకంగా ఉన్న వీరిద్దరికీ అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles