Censor board refuses certificate to qaum de heere movie

Censor Board refuses certificate to Punjabi movie Qaum De Heere movie, Indira Gandhi assasins, Operation Blue Star, Amritsar Golden Temple

Censor Board refuses certificate to Punjabi movie Qaum De Heere movie, Indira Gandhi assasins

ఇందిరాగాంధీ హంతకులు హీరోలుగా పంజాబీ చిత్రం

Posted: 02/06/2014 10:28 AM IST
Censor board refuses certificate to qaum de heere movie

క్వామ్ దే హీరే (జాతి రత్నాలు) పేరుతో పంజాబీలో నిర్మించిన చిత్రంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీని హత్యచేసిన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది ని కధానాయకులుగా చిత్రీకరించగా దానికి కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరించింది.  హత్య చేసిన బీంట్ సింగ్, సత్వంత్ సింగ్, కెహర్ సింగ్ లను త్యాగమూర్తులుగా హీరోలుగా చిత్రీకరించటానికి సెన్సార్ బోర్డు తప్పుపట్టింది. 

సర్టిఫికేట్ ఇవ్వకపోయినా సరే ఆ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 28 న విడుదలచేస్తామంటూ ఆ చిత్ర దర్శకుడు రవిందర్ రవి అన్నారు.  దర్శకుడు ఈ చిత్రంలో కోర్టు తీర్పులతోపాటు విచారణకు సంబంధించిన పేపర్లనన్నిటినీ చిత్రంలో చూపించానన్నారు. 

ఇందిరా గాంధీ హత్యకు ఆపరేషన్ బ్లూ స్టార్ కారణమైతే మరి స్వర్ణ మందిరంలోకి ప్రవేశించి కాల్పులు జరిపిన ఆర్మీ చర్యకు కారణమేమిటో చిత్రంలో చూపించలేదని సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. 

అయితే చిత్రీకరణలో ఎలాంటి తప్పు లేదని, బోర్డ్ నిర్ణయం మీద పునర్విచారణను కోరామని, అవసరమైతే కోర్టుకి పోతామని చిత్ర దర్శకుడు రవి అన్నారు.  సిక్కుల స్వర్ణమందిరంలో పవిత్రమైన అకాలీ తఖ్త్ కి జరిగిన అవమానమే ఇందిరా గాంధీ హత్యకు కారణమని రవి అన్నారు.  చిత్రంలో డైలాగులు కూడా ఆ త్యాగమూర్తుల మరణ వాగ్మూలం మీద ప్రాసిక్యూషన్ కేసు మీద ఆధారపడి రాయటం జరిగిందని కూడా చెప్పారాయన. 

స్వర్ణమందిరాన్ని స్థావరంగా చేసుకున్న ఖాళిస్తాన్ ఉద్యమకారులను వెలికితీయటం కోసం నవంబర్ 1984 లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్, దరిమిలా ఇందిరా గాంధీ హత్య, ఆ తర్వాత వెనువెంటనే ఢిల్లీలో సిక్కుల మీద జరిగిన దహనకాండలు, ఆపరేషన్ బ్లూ స్టార్ కి బ్రిటిష్ ప్రభుత్వం శిక్షణనిచ్చి సహకరించటం వంటి అంశాలు తాజాగా చర్చల్లో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా నిర్మాణం జరగటం దాని ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతించకపోవటం చర్చనీయాంశమైంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles