Shinde asks maha hm to take action in ap techie murder case

Singavarapu Esther Anuya, Singavarapu Prasad, Susheel kumar Shinde, Techie Anuhya

Home Minister Sushilkumar Shinde on Friday asked the Maharashtra government to take swift action and nab those involved in the murder of an Andhra Pradesh.

అనూహ్య కేసులో స్పందించిన హోమంత్రి షిండే

Posted: 01/24/2014 07:54 PM IST
Shinde asks maha hm to take action in ap techie murder case

క్రిష్ణా జిల్లా మచిలీ పట్నానికి చెందిన టీసీఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సింగవరపు ఎస్తేర్ అనూహ్య క్రిస్ మస్ సెలవులకు వచ్చి, ఈనెల 4వ తేదీన లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో ముంబైకి బయలుదేరి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయి, ఈనెల 16వ తేదీన ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే.

ఈ కేసు పై ముంబై పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో కళ్ళు చెదిరే నిజాలు బయటకు వచ్చాయి. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ముంబైలో దిగగానే అంధేరికి అనూహ్య క్యాచ్ మాట్లాడుకుందని, క్యాబ్ డ్రైవర్ కారు దారి మళ్లించి మార్గమధ్యలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడన, ఆమె ఫోన్ లాక్కుని ఓ ఇంట్లో బంధించించి, ఐదు రోజుల పాటు దుండగులు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తర్వాత కుంజూర్‌మార్గ్ లో నిర్జన ప్రదేశంలో యాసిడ్ పోసి ఆమెను తగులబెట్టారని పోలీసులు చెప్పారు.

ఆరోజు నుండి కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అనూహ్య తండ్రి సింగవరపు ప్రసాద్ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను ఢిల్లీలో కలిసి కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీని పై స్పందించిన హోంమంత్రి మహారాష్ట్ర హోంమంత్రికి ఈ కేసు పై త్వరగా పురోగతి సాధించి నింధుతులను పట్టుకోవాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles