Gangrape ordered by village community panchayat

gangrape ordered by village community panchayat, Gangrape Labhpur West Bengal, gangrape on community elders behest

gangrape ordered by village community panchayat

గ్యాంగ్ రేప్ శిక్ష విధించిన గ్రామ కుల పంచాయతీ

Posted: 01/23/2014 08:52 AM IST
Gangrape ordered by village community panchayat

వేరే కులం మనిషిని ప్రేమించిన నేరానికి 20 సంవత్సరాల అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చెయ్యమని శాసించింది ఒక గ్రామంలోని కుల పంచాయతీ పెద్దలు.  మనం ఏ యుగంలో ఉన్నామన్న అనుమానం వస్తుంది ఇలాంటి వార్తలు వింటుంటే.

అది పశ్చిమ బెంగాల్ లాభ్ పుర్ గ్రామం.  కులంలో వాళ్ళని వదిలి ఇతర కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించటమే ఆ అమ్మాయి చేసిన నేరం.  ఈ విషయం తెలుసుకున్న కులపెద్దలంతా ఏకమయ్యారు.  ఆ అమ్మాయికి బుద్ధి చెప్పటమే కాకుండా వేరెవరూ ఇటువంటి కులాంతర వ్యవహారాలకు సాహసం చెయ్యకుండా ఉండాలన్నది వాళ్ళ ఉద్దేశ్యం.  అంతే.  ఐదుగురు యువకులను ఆ అమ్మాయి మీద లైంగిక అత్యాచారానికి పురమాయించారు.  

ఆ అమ్మాయి బీర్భమ్ జిల్లాలో సూరి హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతోంది.  పూర్వకాలం మరణ శిక్షను అమలు చెయ్యటానికి తలారులుండేవారు.  వాళ్ళు తలలు నరికేవారు కాబట్టి తలారులని పేరు వచ్చుంటుంది.  మరి ఇలా శిక్షను అమలు పరచటానికి మానభంగాలకు పాల్పడేవాళ్ళనేమంటారు.  

ఇంత అమానుషంగా ప్రవర్తిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అనుమానం కలుగుతోంది కదూ.  నేరం జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చిందీ ఫిర్యాదు.  ఈ విషయంమీద స్పందిస్తూ ఎఎస్ పి ప్రశాంత్ చౌధరి ఇలా అన్నారు.  సామూహిక అత్యాచారమైతే జరిగింది.  మేము ఆ ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం.  అంతకంటే వివరాలింకేమీ లేవు అన్నారు మీడియా ప్రతినిధులతో.  అయితే ఆ అమ్మాయిని ప్రేమించి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.  

నేరాన్నైతే దాచలేకపోయారు కానీ, కులపెద్దల పంచాయతీ వ్యవహారాన్ని మాత్రం అధికారికంగా బయటపడకుండా దాచగలిగారు.

 -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles