Man kills himself for samaikyandhra

man kills himself for samaikyandhra, sacrifice for samaikyandhra, Telangana bill, state reorganization bill, TDP, AP Chief Minister, Ashok Babu

man kills himself for samaikyandhra

సమైక్యాంధ్రకోసం ప్రాణత్యాగం- నెల్లూరులో ఘటన

Posted: 01/22/2014 02:41 PM IST
Man kills himself for samaikyandhra

37 సంవత్సరాల వాకాటి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు స్టోన్ హౌస్ పేట లోని లాడ్జ్ గదిలో చనిపోతూ తన వేసుకున్న షర్ట్ జేబులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఎపిఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పేర్ల మీద లేఖలు రాసి పెట్టుకున్నారు.  ఆయన లోపల వేసుకున్న స్లీవ్ లెస్ షర్ట్ మీద జై సమైక్యాంధ్ర అన్న నినాదం రాసివుంది. 

శ్రీనివాసులు రెడ్డికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.  రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వలనే శ్రీనివాసులు రెడ్డి మనస్తాపంతో చనిపోయాడని అతని బంధువులు అంటున్నారు.  తెలుగు గడ్డను రెండుగా చీల్చటమే కాకుండా అందులో అవకతవక విధానాన్ని అవలంబించటం, త్వరత్వరగా బిల్లుని ముందుకు తీసుకెళ్తుండటం శ్రీనివాసులు రెడ్డి హృదయాన్ని కలచివేసిందని వాళ్ళు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles