Chandrababu on shashi tharoor

Chandrababu Naidu, Shashi Tharoor, Sunanda Pushkar, Sunanda Tharoor, Pak Journalist Tarar, BJP, TDP

Chandrababu on Shashi Tharoor

శశి థరూర్ మీద గృహ హింస కేసు- చంద్రబాబు

Posted: 01/18/2014 03:10 PM IST
Chandrababu on shashi tharoor

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శశి థరూర్ మీద గృహ హింస కేసు నమోదు చెయ్యాలని, ప్రభుత్వం అందులో జోక్యం కలిగించుకోగూడదని అన్నారు. 

ఐ లవ్ యూ అనే మూడు పదాల ముచ్చటైన ప్రేమ సందేశం ప్రేమికుల మధ్య బాగానే వుంటుంది కానీ వైవాహిక జీవితంలో ఉన్నవారి మధ్య గొడవలు రేపుతుంది.  శశి థరూర్, సునందల వైవాహిక జీవితంలో విషాన్ని చిందించిన ఆ ట్విట్టర్ సందేశం పాకిస్తాన్ పాత్రికేయురాలు తరార్ థరూర్ కి పంపించినట్లుగా చెప్తూ దాన్ని బహిరంగ పరచింది థరూర్ భార్య సునంద.  ఆ తర్వాత అనుమానస్పదంగా శవంగా మారిన సునంద మృతి మీద పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఆమె మరణించిన పంచతార హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తూ, టెలిఫోన్ లోని గతంలోని కాల్స్, మెసేజ్ లను వెలికి తీసి వాటి ద్వారానూ సునంద మరణానికి కారణాన్ని కనిపెట్టే దిశగా పోలీసులు యత్నిస్తుండగా ఛాతీలో నొప్పితో శశి థరూర్ ఐమ్స్ లో చేరటం, తిరిగి డిశ్చార్జ్ అవటం కూడా జరిగింది.

అయితే మహిళలను విలాసవస్తువులుగా మాట్లాడిన శశి థరూర్ ని మంత్రి పదవి నుంచి సత్వరమే తొలగించి ఆయన మీద గృహహింస చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని, ఆ కేసులో రాజకీయ ప్రమేయం ఉండగూడదని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే ఆయన అలా డిమాండ్ చెయ్యటం కూడా రాజకీయ ప్రమేయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  భాజపాతో పొత్తుకి తెదేపా కానీ భాజపా కానీ ఇంతవరకు అథికారికంగా ఎటువంటి ప్రకటనలూ చెయ్యకపోయినా, ఆ రెండు పార్టీల నాయకుల మధ్య జరిగిన భేటీతో పొత్తు ఏర్పడిందని రాష్ట్రమంతా కోడై కూస్తోంది.  దానికి తోడు ఆ భేటీల అనంతరం తెదేపా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతుండటం అందుకు మరింత ఊతమిస్తోంది.  దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతానని అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలు మరీ బలాన్నిస్తున్నాయి ఆ పొత్తుల ఊహలకు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles