Trai rules for cable operators

trai rules, cable operators,Telecom Regulatory Authority,TRAI Act ... Regulations,TRAI announcing tariff rules

trai rules for cable operators

వివరాలు లేకుంటే కేబుల్ కట్

Posted: 01/18/2014 01:30 PM IST
Trai rules for cable operators

డిజిటలైజేషన్ పేరుతో కేబుల్ ఆపరేటర్ల గుండెల్లో గుబులు పుట్టించిన ట్రాయ్ ఇప్పుడు మల్టీ సిస్టమ్ ఆపరేటర్లపై మరో  హెచ్చరిక జారీ చేసింది. కేబుల్ ఆపరేటర్లు తమ పరిధిలో ఉన్న చందాదారుల చిరునామాలను జనవరి 27 నాటికల్లా తెలియ జేయాలని లేని పక్షంలో వారికి కేబుల్ ప్రసారాలు నిలిపి వేయడం జరుగుతుందిని తేల్చి చెప్పింది.

రెండో దశ కేబుల్ టివీ డిజిటలైజేషన్ పరిధిలోకి వచ్చిన నగరాల్లొని ఆపరేటర్లు తక్షణం తమ దగ్గరున్న కేబుల్ వినియోగ దారుల వివరాలను అందజేయాలని  టెలికం నియంత్రణ  ఫ్రాధికార సంస్థ ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. రెండో దశలో దేశంలోని 36 నగరాలకు దీనిని వర్తింప జేయగా, 23 నగరాల్లోని ఆపరేటర్లు మాత్రమే అరకొరగా వినియోగ దారుల వివరాలిచ్చారని పేర్కొంది.

దీంతో వివరాలు అందించిన  ఆపరేటర్లకు  మాత్రమే కేబుల్ టీవీ ప్రసారాలు అందేలా చూడాలని ట్రాయ్ కోరింది. నిజానికి  డిజిటలైజేషన్ ప్ర్రక్రియలో సెట్ టాప్ బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు చందాదారుల వివరాల పత్రాలను సేకరించి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. డిజిటల్ అడ్రస్ బుల్ కేబుల్ టీవీ సిస్టమ్ అమలు విషయంలో అనేక కేసులు న్యాయస్థానంలో ఉన్న కారణంగా కేంద్రం ప్రసారాల శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. అయతే ఇది హైదరాబాద్ నగరానిక  వర్తిచక పోవడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles