Sabbam hari comments on jagan

Sabbam Hari is Loksabha MP of Andhra Pradesh, Anakapalli MP Sabbam,YSR Congress President Y S Jagan Mohan Reddy, Sabbam Hari's entry to YSRC doubtful

sabbam hari comments on jagan

జగన్ పై సబ్బం తిరుగుబాటు

Posted: 01/17/2014 08:12 AM IST
Sabbam hari comments on jagan

ఇన్నాళ్ళూ జగన్ కు సన్నిహితంగా  మెలిగిన కాంగ్రెస్ నేత సబ్బం హరి తాజాగా వైకాపా అధినేత జనన్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జగన్ కు చత్తశుద్ధి లేదని, సమైక్యాంధ్ర విషయంలో నాటకాలాడుతున్నాడని  ఆరోపించారు. కొంతకాలంపాటు  జగన్ కు సన్నిహితంగా  ఉన్న ఈ నేత ఇప్పడిలా మాట్లాడడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. సమైక్యాంద్ర  ఉద్యమం పేరుతో జగన్ నాటకాలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ నేపధ్యంలో జనం జగన్ కపట బుద్ధిను గ్రహించారని,  అందుకే ఆ పార్టీకి ఆదరణ కొరవడుతోందని అన్నారు.

ఇప్పటికైనా జగన్ సమైక్యాంద్ర కోసం తగిన రీతిలో పోరాడితే బాగుంటుందని సూచించారు. అతను తనపై విమర్శలు చేయించిన అనతంరం నుండి ఇప్పటి వరకూ  జగన్ తో మాట్లాడనే లేదన్నారు. వైఎస్ మరణానంతరం అతని కుమారునికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అతని వెంట తిరిగానని, అంతేగాని పదవుల కోసం పాకులాడలేదని చెప్పారు.

అదే విధంగా కాంగ్రెస్ తో వివాదానికి దిగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందిని తాను జగన్ ను హెచ్చరించానిని  అన్నారు. ఎప్పటికప్పుడు పార్టీ గురించి సర్వేలు చేయించే జగన్ కు తన పార్టీ పరిస్థితేమిటో ఇప్పటికే తెలుసన్నారు.. తెలంగాణ జిల్లాల్లో జగన్ పార్టీ పూర్తి గా కనుమరుగైందని   పేర్కొన్నారు. అదేవిధంగా సబ్బం హరి కాంగ్రెస్ తీరుపైనా పలు విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకోవాలని లేదంటే కాంగ్రెస్ దెబ్బతినడం ఖాయమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles