No pants subway ride

no pants subway ride, streaking, Hyderabad Metro project, No pants ride in Hyderabad metro, Import of no pants subway ride

no pants subway ride

ప్యాంట్ లేకుండా ప్రయాణం- దిగుమతి కాబోతున్న వేడుక!

Posted: 01/16/2014 01:23 PM IST
No pants subway ride

మెట్రో రైళ్ళలో ప్యాంట్ లేకుండా ప్రయాణం చెయ్యటమనే ఆనవాయితీ న్యూయార్క్ సిటీలో ప్రతి జనవరి నెలలోనూ ఇంప్రూవ్ ఎవిరీవేర్ ఆధ్వర్యంలో జరుగుతోంది.  అయితే అండర్ వేర్ లయితే ఉంటాయి లెండి! 

ప్యాసెంజర్లు శరీరంలో పైభాగంలో ధరించేవన్నీ చక్కగా ధరిస్తరు కాలర్ కి టై, తల మీద క్యాప్ తో సహా.  కాకపోతే కింది భాగంలో ప్యాంట్ మాత్రం ఉండదు.  రైల్లోకి ఎక్కగానే విడిచేస్తారు.  మొదట్లో ఏడుగురితో 2002 లో మొదలైన ఈ చిలిపి చేష్ట ఇప్పుడు అంతర్జాతీయ వేడుకగా మారి న్యూయార్క్ చుట్టుపక్కల నగరాలకు కూడా వ్యాపించింది.  జనవరి చలిలో పైన ఉన్ని దుస్తులు ధరిస్తూ కింద ప్యాంట్ లేకుండా ఉండటం ఇందులో విశేషం!

అన్నిటిలోనూ పాశ్చాత్య పద్ధతులను అవలంబించటానికి ఉర్రూతలూగే మన దేశంలో కూడా ఈ సంస్కృతి రావొచ్చేమే.  ముఖ్యంగా హైద్రాబాద్ నగరంలో చకచకా సాగుతున్న మెట్రో రైళ్ళ పనులు చూస్తుంటే ఈ లోపులో ఈ నోప్యాంట్స్ సబ్ వే రైడ్ అనేది కూడా దిగుమతి చేసుకుంటారనిపిస్తోంది.  దానితో మైట్రో రైలు ని మంత్రి గారు ఆవిష్కరించిన సమయంలోనే ప్యాంట్స్ లేని ప్రయాణీకుల బృందం కూడా ఉత్సాహంగా ఎక్కవచ్చేమో. 

ఆఁ.. అని కొట్టిపారెయ్యకండి.  బర్త్ డే కేక్ కట్టింగ్, బఫె, కాబరే, న్యూయియర్ క్రిస్ట్మస్ ఈవ్ లు ఎప్పుడో రాలేదూ.  ఈ మధ్యకాలంలో వాలెంటైన్స్ డే కూడా వచ్చిందికదా.  ఇక ఈ నో ప్యాంట్స్ సబ్ వే రైడ్ కూడా వచ్చి అలరించవచ్చేమో.  కాకపోతే ఆరోజు మర్చిపోకుండా అండర్ గార్మెంట్స్ ధరించటం తప్పనిసరి.  లేకపోతే స్ట్రీకింగ్ కేసులో పోలీస్ బుక్ చెయ్యవచ్చు.  స్ట్రీకింగ్ ఇంకా మనదేశంలో రాలేదు లెండి భయపడకండి.  దేనికైనా నిరసనగా దిశమొలతో పబ్లిక్ ప్లేస్ లో కనిపించటమే స్ట్రీకింగ్! ఇది వేడుక కాదు కదా అందుకే రాలేదు.

కానీ నో ప్యాంట్స్ రైడ్ మాత్రం మెట్రోతో పాటు మన రాష్ట్ర రాజధానికి దిగుమతి కావొచ్చు! అయితే మరీ బిడియమనిపిస్తే, పై ఫొటోలో ఉన్నట్టుగా సెల్ ఫోన్లో బిజిగా ఉంటే సరి.  పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు.!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles