Purandheswari against t bill

Tbill, Purandeswari Tbill, Purandeswari not support T, Telangana bill, Union minister Daggubati Purandeswari , T-bill Parliament, Seemandhra MPs, Telangana MPs,

Purandeswari said she will not support Telangana bill.

తెలంగాణా బిల్లుకి మద్దతునివ్వను

Posted: 12/23/2013 12:02 PM IST
Purandheswari against t bill

విశాఖపట్నం పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెలంగాణా బిల్లుకి ఇప్పుడది ఉన్న పరిస్థితుల్లో మద్దతు నివ్వటం జరగదని చెప్పారు.

 

ఉమ్మడి రాజధానిగా చెయ్యటం రాజ్యాంగానికి వ్యతిరేకమని, సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రభుత్వాన్ని కోరినవాటిలో ఏ అంశానికీ స్పష్టమైన హామీలు బిల్లులో లేవని, అందువలన ఆ బిల్లుకు పార్లమెంటులో మద్దతునివ్వటం జరగదని పురంధేశ్వరి అన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు సంపూర్ణస్థాయిలో తయారవలేదని, అందులో ఎన్నో విషయాలు ఉటంకించలేదని అన్న పురంధేశ్వరి ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లుకి మద్దతు నివ్వటం జరిగే పని కాదని స్పష్టం చేసారు.

 

అయితే, నాయకులు మీడియాలో మాట్లాడేదంతా ప్రజలను ఉద్దేశించి చెప్తున్న మాటలని, అధిష్టానం దగ్గర తలలూపుతుంటారని ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం, పదవులను, కేంద్రంలో పరపతిని కాపాడుకోవటం కోసం ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్తుంటారని సమైక్యాంధ్ర మద్దతుదార్లు ఎప్పడూ చేస్తున్న విమర్శే. ఎన్ని ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వం చలించకపోవటానికి కారణమదే నని కూడా అంటూ వస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రుల ముట్టడి ప్రయత్నాలు, వాళ్ళ ఇంటి ముందు ఆందోళనలు చేసినా పరిస్థితి మారటం లేదని వాపోతూ, వారికిక రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించటానికి కూడా వాళ్ళు చెప్తూ వస్తున్న కారణమదే.

 

బిల్లు సమగ్రంగా లేదు కాబట్టి వ్యతిరేకిస్తున్నామంటే వాటిని సవరిస్తే మద్దతునిస్తున్నట్లే కదా అని అంటున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకమేనని, బిల్లులో కావాలని కొన్ని లోపాలు చూపించి వాటిని వ్యతిరేకించినప్పుడు వాటిలో సవరణలు చేసి ఇదిగో మీరు ఇప్పుడు అంగీకరిస్తున్నారు అని అనటానికి కూడా అవకాశం కల్పిస్తున్నారని కూడా సమైక్యాంధ్ర మద్దతుదార్లు అంటున్నారు.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles