Fdi in railways for high speed traffic

FDI in Railways for High Speed Traffic, Indian Railways, Indian Railways, Suburban trains high speed, 100 percent FDI in railways

FDI in Railways for High Speed Traffic

భారత రైల్వేకి విదేశీ పెట్టుబడులతో హైస్పీడ్ వైభవం

Posted: 01/09/2014 06:41 PM IST
Fdi in railways for high speed traffic

రైల్వే అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను త్వరలో అనుమతించబోతోంది.  దీనితో విదేశీ పెట్టుబడిదారులు సబర్బన్ ఏరియాలలోనూ, గనులు, ఓడరేవులు, పవర్ ప్రోజెక్ట్ లను కలుపుతూ సాగే హైస్పీడ్ రైలు పట్టాలను పూర్తిగా సొంతం చేసుకుని నడిపే అవకాశం ఉంటుంది. 

అయితే హైస్పీడ్ రవాణాకు అంతరాయం కలుగకుండా ఉండటం కోసం ప్యాసెంజర్, గూడ్స్ రవణా సేవలను మాత్రం విదేశీ పెట్టుబడిదారులకు ఇవ్వబోవటం లేదు.  నూరు శాతం విదేశీ పెట్టుబడులతో నడిచే ఈ విధానం వలన భారత దేశానికి 10 బిలియన్ల డాలర్ల విదేశీ పెట్టుబడి లభ్యమౌతుందని ఇండస్ట్రియల్ పోలసీ అండ్ ప్రొమోషన్  శాఖ అధికారి తెలియజేసారు. 

రైలు ప్రయాణం సుఖవంతం, చౌక కూడా.  అందుకే ప్రతిరోజూ 25 మిలియన్లమంది రైళ్ళలో ప్రయాణం చేస్తారు.  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 66 సంవత్సరాలలో 13000 కి.మీ అదనంగా జోడించటంతో మొత్తం 64000 కిమీ ల రైలు సర్వీస్ ప్రస్తుతం దేశంలో నడుస్తోంది.  చైనాతో పోల్చుకుంటూ గత ఐదు సంవత్సరాలలో భారత దేశంలో కేవలం 1750 కి.మీ జోడించగా చైనాలో 14000 కి.మీ పొడవు పెరిగింది.  దాని వలన రోడ్డు రవాణా మన దేశంలో 60 శాతం పెరిగింది.  చైనాలో కేవలం 22 శాతమే పెరిగింది. 

రైల్వేశాఖలోని ఈ ప్రతిపాదన పార్లమెంటులో అనుమతి పొందవలసిన అవసరం లేదు కాబట్టి క్యాబినెట్ నోట్ గా వచ్చేవారం వెళ్ళబోతోంది. 
నార్త్ అమెరికా, యూరప్, యుఎస్, జపాన్, కెనడా దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టటానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles