Devyani gets full immunity asked to leave us

Devyani Khobragade gets full immunity, Devyani asked to leave US, US Attorney Preet Bharara, Devyani Attorney Deniel Arshak, Sangita Richard

Devyani Khobragade gets full immunity asked to leave US

దేవయాని కేసులో ఎట్టకేలకు

Posted: 01/10/2014 09:08 AM IST
Devyani gets full immunity asked to leave us

అమెరికాలో పనిచేస్తున్న భారత్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడె మీద వీసా నియమాలను ఉల్లంఘించిన కేసుని పెట్టి అత్యుత్సాహం చూపించి ఆమెనే కాక యావద్భారతావనిని అగౌరవపరచిన అమెరికా ప్రభుత్వానికి భారత ప్రభుత్వం కోరినట్లుగా బేషరతుగా క్షమాపణ చెప్పటానికి ముఖం చెల్లకపోయినా దౌత్యవేత్తలు లభించే ఇమ్యూనిటీని ఇస్తూ యుఎస్ ని విడిచి పొమ్మని ఆదేశించటం జరిగింది. 

దేవయాని మీద తప్పు కేసుని బనాయించి వేధించారంటూ ఆమె తరఫున వాదిస్తున్న అడ్వకేట్ డేనియల్ అర్షాక్ అన్నారు.  యుఎస్ అటర్నీ ప్రీత్ భరారా మోపిన కేసు నిరాధారమైనదని తప్పుల తడకని ఆయన అన్నారు. 

ఖోబ్రాగడెకి గల పూర్తి ఇమ్యూనిటీని అంగీకరిస్తూ, భారత్ ఆమెకు అందించిన ఇమ్యూనిటీని ఉపసంహరించుకోవటానికి అంగీకరించకపోవటం వలన ఆమె అమెరికా దేశాన్ని వదిలిపెట్టి పోవలసిందిగా స్టేట్ డిపార్ట్ మెంటు కోరింది. 

అదే మన దేశంలో జరిగితే ప్రధాన మంత్రి దగ్గర్నుంచి ప్రతి మంత్రీ జరిగిన దానికి పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చుతూ క్షమాపణ కోరేవారే.  ప్రీత్ భరారా చేసింది తప్పని, ఆయన తప్పుడు కేసుని పెట్టారన్న విషయం ప్రోసిక్యూటర్ కార్యాలయానికి క్షుణ్ణంగా తెలుసంటూ డేనియల్ అర్షాక్ ఆరోపించారు.  అంతే కాదు ప్రీత్ భరారా చేసిన పొరపాటుతో తనకు తక్కువ భత్యమిస్తున్నారని దేవయాని మీద అభియోగాన్ని మోపిన సంగీతా రిచర్డ్ కుటుంబం ఇంచక్కా అమెరికాలో శాశ్వత పౌరసత్వాన్ని పొందటం కూడా జరిగిందని అర్షాక్ అన్నారు. 

ఖోబ్రాగడె గురువారం సాయంత్రం అమెరికా నుండి భారత్ కి వెళ్ళవలసివుంది.  దానివలన ప్రోసిక్యూటర్ కోర్టుకి ప్రాథమిక విచారణ కోసం రాసిన లేఖలో ఆమె బహుశా ఇండియా వెళ్ళిపోయారని కూడా రాసారు.  కానీ ఆమె అక్కడే మన్హట్టన్ లోనే ఉన్నారంటూ అర్షాక్ తెలియజేసారు. 

తప్పులెవరైనా చెయ్యవచ్చు కానీ తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు దాన్ని ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి.  అది లేని అమెరికా ఇంకా తన ముఖం చాటేసుకుంటూ తప్పు మార్గాలనే వెదుకుతోందని దీనితో అర్థమౌతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles