Suo motu case on ponna prabhakar

suo motu case on ponna prabhakar, ponnam threatening cm, ponnam under IPC 153, ponnam talks of blasting CM chopper

suo motu case on ponna prabhakar

పొన్నం పై సుమోటో కేసు- మాటవరసకన్నానన్న ఎంపి

Posted: 01/04/2014 11:09 AM IST
Suo motu case on ponna prabhakar

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని ప్రారంభించటానికి వస్తే ముఖ్యమంత్రి హెలికాప్టర్ ని పేల్చివేస్తానని అన్న పొన్నం ప్రభాకర్ మీద పోలీసులు సుమోటో కేసుని బుక్ చేసారు. 

గురువారం జరిగిన పత్రికా విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి పట్ల భయాందోళనకు గురిచేసే వ్యాఖ్యలు చేసినందుకుగాను ఐపిసి 153 కింద కరీం నగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మీద కేసు బుక్ చేసామని ఎస్పీ వి.శివకుమార్ తెలియజేసారు.  అందుకు సంబంధించిన వీడియో, మీడియా క్లిప్లింగ్ లను సేకరించిన పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

మీడియా ముందు తాను చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారం రేపుతాయని ఊహించని పొన్నం అందుకు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, మీడియాలో తన మాటలను ఇలా సమర్ధించుకున్నారు-

నేనేమైనా ఉగ్రవాదినా, నా దగ్గర తుపాకులున్నాయా, నేనెలా హెలికాప్టర్ ని కాల్చివెయ్యగలను.  ఏదో మాట సామెతకు అంటే దాన్నో పట్టుకుంటున్నారు.  చంద్రబింబం లాంటి ముఖం అంటే నిజంగా చంద్రబింబంలా ఉంటుందనా.  ఏదో మాట వరసకు రావద్దన్నా వస్తున్న ముఖ్యమంత్రి రానివ్వమన్న విషయాన్ని అలా చెప్పినంత మాత్రాన నిజంగా హెలికాప్టర్ ని పేల్చేస్తామా.   అయినా ఒక్క వ్యక్తి కిరణ్ కుమార్ పోయినంత మాత్రాన నష్టమేం జరగదు.  తెలంగాణా కోసం వేల మంది బలిదానం చేసిన విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడని ముఖ్యమంత్రి ఉంటేనేం లేకపోతేనేం అంటూ తన మాటలను సమర్ధించుకుంటూనే మరోసార్ కిరణ్ కుమార్ మీద ధ్వజమెత్తారు పొన్నం

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles