Harish rao against disruptions in assembly

harish rao against disruptions in Assembly,

harish rao against disruptions in Assembly

సభను అడ్డుకుంటున్న నేతలపై హరీశ్ రావు గుర్రు

Posted: 01/04/2014 10:23 AM IST
Harish rao against disruptions in assembly

నిన్నంతా శాసన సభలో ఏమీ జరగకుండానే వాయిదా పడింది.  ఈరోజు కూడా శాసనసభ ఉద్వేగాలు నినాదాల మధ్య గంటసేపు వాయిదా పడగా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతున్న తెరాస సీనియర్ నాయకుడు హరిష్ రావు, సభను కావాలనే అడ్డుకుని చివరకు బిల్లు మీద చర్చకు సమయం సరిపోలేదని అనటానికి సీమాంధ్ర నేతలు చూస్తున్నారంటూ ఆరోపించారు. 

సభాపతి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బిల్లు మీద వెంటనే చర్చ ప్రారంభించి అడ్డుకున్నవారిని సస్పెండ్ చెయ్యాలని హరీష్ రావు అన్నారు. 

అయితే స్పీకర్ పోడియం దగ్గరకు పోయి నినాదాలు చేస్తున్నవారిలో ఇరు ప్రాంతాల వారూ ఉన్నారు.  జై తెలంగాణా, జై సమైక్యాంధ్ర నినాదాలు సమానంగా వినవచ్చాయి.  పునర్విభజన బిల్లు సంగతి మాట్లాడక ముందే శాసన సభ్యులందరూ ఎవరి డిమాండ్ ని వారు గట్టిగా చెప్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. 

సభావ్యవహారాల శాఖను ముఖ్యంగా సీమాంధ్ర మంత్రి శైలజానాథ్ కి అప్పగించటం వలన సమైక్య ప్రతిపాదన ముందు వస్తుందేమోనన్న భయంతో తెలంగాణా నాయకులు, తెలంగాణా బిల్లు చర్చకు వస్తుందేమోన్న భయంతో సీమాంధ్ర నాయకులు సభలో గందరగోళాన్ని సృష్టించి సజావుగా సాగకుండా చేస్తున్నారు. 

అందువలన, హరీష్ రావు అన్నట్లుగా బిల్లు మీద చర్చ జరపకుండా ఆలస్యం చెయ్యటానికే సభలో సభాపతి పోడియం ను చుట్టముట్టినట్లయితే అది ఇరువర్గాల వారికీ వర్తిస్తుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles