Women ran away from state home

women ran away from State home, Hyderabad State home, SR Nagar police state home case, four women run from state home

women ran away from State home

ఆశ్రయం కోరే మహిళలు ఎందుకు పారిపోతారు?

Posted: 01/02/2014 03:10 PM IST
Women ran away from state home

ఎక్కడా దిక్కులేని యువతులు కూడా లభించిన ఆశ్రయం నుంచి మూడోకంటికి తెలియకుండా భద్రతా ఏర్పాట్లను ఛేదించుకుని మరీ పారిపోయారంటే ఆ మహిళలు ఆ ఆశ్రమంలో పడుతున్న వేదన ఏమిటో అర్థమౌతోంది. 

హైద్రాబాద్ యూసఫ్ గుడా లోని స్టేట్ హోమ్ నుంచి నలుగురు మహిళలు ఈరోజు ఉదయం పారిపోయారు.  అందులో ఇద్దరు యువతులను కోర్టు ఆదేశాల మేరకు అక్కడ చేరినవారైతే మిగిలిన ఇద్దరు అనాధ మహిళలట. 

బయట పొట్టకూటికి ఎంత కష్టపడాలో, కష్టపడ్డా కడుపునిండా తినగలరా, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారన్నది వాళ్ళకి అంతుబట్టకపోయినా అక్కడి నుంచి పోతే అంతే చాలు అనుకుని ప్రహరీ గ్రిల్స్ ని తొలగించుకుని బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ మహిళలు అక్కడ ఏమేమి అగచాట్లు పడ్డారో ఊహకందనిది.  ముందీ గట్టెక్కితే తర్వాత చూసుకుందామని అనుకుని పారిపోయిన యువతులు ఏమేం కష్టాలు పడ్డారన్నది వెలుగులోకి రావటం వాళ్ళు మళ్ళీ దొరికి నిర్భయంగా చెప్పేంత వరకూ కష్టమే.

ఆ నలుగురు యువతులలో ఒక యువతికి మూడేళ్ళ కొడుకు కూడా ఉన్నాడని మహిళలు పారిపోయిన కేసు నమోదు చేసిన సరోజినీ నగర్ పోలీసులు తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles