Pranab presented ndtv 25 indian legends

pranab mukherjee, rashtrapati bahvan, ndtv living legends awards, pranab presented ndtv 25 indian legends, ndtv , national media, national news, president pranab mukherjee, national political news, telangana bill, telagana bill war, pranab t-bill, political news, latest telugu news, breaking news, headlines

pranab presented NDTV 25 Indian Legends

సక్సెస్‌కు షార్ట్‌కట్‌లుండవు : రాష్ట్రపతి ప్రణబ్‌

Posted: 12/17/2013 02:43 PM IST
Pranab presented ndtv 25 indian legends

విజయానికి దగ్గరిదార్లేవీ ఉండవని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. విద్యా, పరిశోధన, ఆవిష్కరణల్లో పురోగతి లేకుండా అర్థికాభివృద్ధి సాధ్యం కాదనే వాస్తవాన్ని గుర్తించాలని తెలిపారు. పురస్కార గ్రహీతలను ప్రస్తావిస్తూ సాధారణ తరగతి నుంచి వచ్చినవీరంతా తమతమ రంగాల్లో పట్టుదల, నిజాయితీతో కృషి చేసి ఉన్నతశిఖరాలు అధిరోహించారని ప్రశంసించారు. విజయానికి సత్వర మార్గాలు, షార్ట్‌కట్‌లు ఉండవని వీరి నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచపు ఆర్థికవ్యవస్థలో తన వంతు స్థానం దక్కించుకోవాలటే దేశంలో విద్యా, పరిశోధనా రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆయన తెలిపారు. జాతీయ వార్తా ఛానెల్‌ ఎన్డీటివి 25 మంది ప్రముఖులకు గ్లోబల్‌ లివింగ్‌ లెజెండ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ పురస్కారాలను రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ ముఖర్జీ ప్రదానం చేశారు.

 

ఎన్డీటివి లివింగ్‌ లెజెండ్రీలు వీరే!

భారతరత్నకు ఎంపికైన క్రికెట్‌ దిగ్గజం

 

సచిన్‌ టెండూల్కర్‌,

రసాయన శాస్త్రవేత్త సిఎన్‌ఆర్‌ రావు,

ప్రఖ్యాత సంగీత స్వరకర్త ఎఆర్‌ రెహ్మాన్‌,

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌,

జన్యు శాస్త్రవేత్త వెంకటరమణ రామకృష్ణ,

మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌,

టెన్నిస్‌ సంచలనం లియాండర్‌ పేస్‌,

సినీ విఖ్యాత నటులు అమితాబ్‌ బచ్చన్‌,

రజనీకాంత్‌, షారుఖ్‌ఖాన్‌,

వహిదా రెహ్మాన్‌ ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ గ్రహిత అమర్థ్యసేన్‌,

ప్రముఖ నేత్ర వైద్యులు ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌,

గ్రామీణ మహిళల సాధికారత కోసం ఉద్యమిస్తున్న ఇలా భట్‌,

స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ ఉద్యమకర్త ఫలి నారిమన్‌,

వ్యాపారదిగ్గజాలు రతన్‌ టాటా,

ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి (ఇన్ఫోసిస్‌),

ముఖేష్‌ అంబానీ (రిలయన్స్‌ ఇండిస్టీస్‌),

ఇంద్రానూయి (పెప్సీ),

యూసుఫ్‌ ఖాజా హమీద్‌ (సిఫ్లా డ్రగ్స్‌),

ప్రఖ్యాత రచయిత విక్రమ్‌ సేత్‌,

సంగీతకారులు హరిప్రసాద్‌ చౌరసియా,

జుబిన్‌ మెహతా,

ప్రఖ్యాత ఇంజనీర్‌ అనిష్‌ కపూర్‌,

ప్రముఖ చిత్ర కళాకారుడు సయ్యద్‌ హైదర్‌ రాజా ఈ పురస్కారాలు అందుకున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles