Armaan sofia spat armaan kohli gets bail

armaan kohli, sofia hayat, armaan kohli granted bail, armaan kohli sofia, bigg boss season 7 participant, bigg boss saath-7 contestant armaan kohli, british-pakistani actor sofia hayat, lonavala police, actor Armaan Kohli

Armaan-Sofia spat- Armaan Kohli gets bail, Armaan Kohli granted bail

పాకిస్తాన్ నటిని బూతులు తిట్టిన కోహ్లీకి.. బెయిల్

Posted: 12/17/2013 03:15 PM IST
Armaan sofia spat armaan kohli gets bail

బ్రిటిష్ పాకిస్థాన్ నటి సోఫియా హయత్ బిగ్ బాస్ టీవీ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ కూడా బిగ్ బాస్ షో లో పాల్గొనటం జరిగింది. అయితే ఈఇద్దరి మద్య ఏం జరిగిందో తెలియదు గానీ, ఇప్పుడు నేషనల్ మీడియా ఈ ఇద్దరి గురించి చర్చలు జరుపుతుంది. బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది.

 

నటి సోఫియా హయత్ ఫిర్యాదు మేరకు లోనావాలా పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో అతడిని బిగ్ బాస్ హౌస్ లోంచి తీసుకెళ్లారు. తనను బూతులు తిట్టి, కొట్టాడంటూ అర్మాన్ కోహ్లీపై సోఫియా హయత్ ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వాళ్లు దర్యాప్తు నిమిత్తం లోనావాలా పోలీసులకు బదిలీ చేయగా, అక్కడి పోలీసులు.. కేసును దర్యాప్తు చేసి, కోహ్లీని అరెస్టు చేశారు.

 

సోఫియా హయత్ ఫిర్యాదుతో అర్మాన్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు శాంతాక్రజ్ సీనియర్ ఇన్ స్పెక్టర్ అరుణ్ చవాన్ తెలిపారు. కోహ్లీపై ఐపీసీ సెక్షన్లు 324, 504, 509, 506, 354ల కింద కేసులు నమోదయ్యాయి. అనంతరం అర్మాన్ కోహ్లీకి బెయిల్ మంజూరైంది. స్థానిక కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles