Nannapaneni rajakumari fire on trs leaders

nannapaneni rajakumari, telangana bill, telangana bill war, nannapaneni rajakumari fire on trs leaders, tdp vs trs, telangana highlights, mlc nannapaneni rajakumari, nannapaneni rajakumari press meet, tdp leader nannapaneni rajakumari, nannapaneni rajakumari comments, political news, latest telugu news, breaking news, headlines

nannapaneni rajakumari fire on trs leaders

టీఆర్ఎస్ నేతలు గతం మరిచిపోయారా? నన్నపనేని

Posted: 12/16/2013 06:48 PM IST
Nannapaneni rajakumari fire on trs leaders

ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లును సీమాంద్ర నేతలు ఆగ్రహంతో చించారు. కొంతమంది నేతలు ఏకంగా బిల్లుకు నిప్పుపెట్టారు. దీంతో తెలంగాణ ప్రాంత నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. తెలంగాఱణ బిల్లు ను చించటం, కాల్చడం అంటే .. తెలంగాణ ప్రజలను అమానించినట్టే అని తెలంగాణ నేతలు అంటున్నారు. తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని నిరసన వ్యక్తం చేస్తుంటే టీఆర్ఎస్ నేతలు రాద్దాంతం చేస్తున్నారని, గతంలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి, ఆయన ముఖంపై హరీష్‌రావు విసిరికొట్టిన విషయం టీఆర్ఎస్ నేతలు మరిచిపోయారా? అంటూ నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు.

 

అసెంబ్లీలో వారు చేసిన దాడులను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోవాలని ఆమె అన్నారు. ఈరోజు శాసనమండలిలో తమ నిరసన తెలియజేస్తుంటే తనను తోసివేశారని, కిందపడిపోయానని, స్వల్పంగా గాయాలు అయ్యాయని, అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉంటూ మమ్మల్నే బయటకు నెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇప్పుడు ఇలా ఉంటే, రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంద్రులను రక్షణ ఎక్కడ ఉంటుందని నన్నపనేని ఆందోళన వ్యక్తం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles