Errabelli comment on kiran health

errabelli, errabelli dayakar rao, cm kiran, errabelli comment on kiran health, errabelli fire on cm kiran, telangana bill, telangana issue, political news, latest telugu news, breaking news, headlines

errabelli comment on kiran health

సిఎం కిరణ్ కు జ్వరం తగ్గకూడదని కోరుకుంటున్న లీడర్స్

Posted: 12/16/2013 01:33 PM IST
Errabelli comment on kiran health

ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమాశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి డుమ్మా కొట్టారు. అయితే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ మీటింగ్ ఎందుకు రాలేదంటే.. ఆయన తీవ్రమైన జ్వరంతో బాదపడుతున్నట్లు సమాచరం. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ నేతలు, తెలంగాణ తెలుగుదేశ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం సభకు రానందుకు మాకు చాలా ఆనందంగా ఉందని వారు అంటున్నారు. అంటే ఈరోజు తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు పై మాట్లాడుతూ.

 

తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాలని సీమాంధ్ర ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినందుకు స్పీకర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లుపై అభిప్రాయాలు సేకరించి రాష్ట్రపతికి పంపాలన్నారు. బిల్లుపై ఓటింగ్ అవసరం లేదన్నారు. ఇదే సమయంలో ఎర్రబెల్లి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తు చేశారు. కిరణ్ అడ్డుపడితేనే బిల్లు మూడు రోజులు ఆగిందని ఆరోపించారు.

 

తెలంగాణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందే వరకు సీఎం పూర్తిగా జ్వరంతోనే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అంటే సీఎం కిరణ్ తెలంగాణ బిల్లును ఎలాగైన అడ్డుకుంటామని సీమాంద్ర ప్రజలకు, నేతలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ సిఎం అసెంబ్లీ వస్తే .. తెలంగాణ బిల్లును అడ్డుకుంటారని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సీఎం కిరణ్ కు జ్వరం తగ్గకూడదని కోరుకుంటున్నానని ఎర్రబెల్లి అన్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా అదే కోరుకుంటున్నారని ఎర్రబెల్లి చెప్పటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles