Cm kiran chandrababu skip assembly session

cm kiran, chandrababu, assembly session, chandrababu skip assembly session, cmkiran skip assemblysession, assembly, nadendla manohar, ap bifurcation, telangana bill, telangana issue, assembly winter session, cmkiran skip today assemblysession, political news, latest telugu news, breaking news, headline

cm kiran chandrababu skip assembly session

తప్పించుకున్న చంద్రబాబు-సీఎం కిరణ్

Posted: 12/16/2013 12:12 PM IST
Cm kiran chandrababu skip assembly session

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తప్పించుకున్నాడు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలోకి రాకుండా తప్పించుకున్నాడు. చంద్రబాబు బాటలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. అధికార పార్టీలో ఉండి, సమైక్యాంద్రకోసం పోరాటం చేస్తున్న నల్లారి కిరణ్ కమార్ రెడ్డి, సమన్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఒకేసారి అసెంబ్లీకి డుమ్మా కొట్టడం పై అనేక అనుమానాలకు దారీ తీస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

 

అయితే విభజన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో సీఎం కిరణ్ , ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరు లేరు. దీంతో అసెంబ్లీ కార్యదర్శి సదారాం ముసాయిదా బిల్లు అంశాల వివరాలను సభ్యులకు చదవి వినిపించారు. ఇప్పుడు అందరి నోట ఈ ఇద్దరి గురించే చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరి అసెంబ్లీకి డుమ్మా కొట్టాడం పై సీమాంద్ర నేతలు , సీమాంద్ర ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సీఎం కిరణ్, చంద్రబాబు నాయుడు కావాలేనే ఈరోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టారని సీమాంద్ర నేతలు అంటున్నారు.

 

అయితే సీఎం కిరణ పై తెలంగాణ మంత్రలు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రులకు అపాయింట్ మెంట్ ఇచ్చిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగానే చేశారని అపాయింట్ మెంట్ రద్దు చేశారని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles