Kannada actress madhuri creates drunk nuisance on the road

kannada actress madhuri creates drunk nuisance on the road, sandal wood actress madhuri, rambo fame heroine madhuri, madhuri and famous fashion designer ramesh dimla booked for drunken case,

kannada actress madhuri creates drunk nuisance on the road, sandal wood actress madhuri, rambo fame heroine madhuri, madhuri and famous fashion designer ramesh dimla booked for drunken case,

నడిరోడ్డు పై తాగి నటి హల్ చల్

Posted: 11/30/2013 08:52 AM IST
Kannada actress madhuri creates drunk nuisance on the road

తాగడం ఇప్పుడు సెలబ్రెటీలకు ఓ ప్యాషన్ అయిపోయింది. రాత్రంతా తాగుతూ మత్తులో ఎంజాయ్ చేయడం మామూలే. కానీ పట్టపగలు... మిట్ట మధ్యాహ్నాం శ్యాండిల్‌వుడ్ నటి మాధురి ఫుల్లుగా తాగి నడి రోడ్డుపైనే రచ్చ రచ్చ చేసి నానా హంగామా చేసి పోలీసులకు చిక్కింది. ఈమెతో పాటు మరో నలుగురు ఫ్యాషన్ డిజైనర్లు కూడా తాగేసి పోలీసులకు బుక్కయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... మల్లేశ్వరం 17వ క్రాస్‌లోని వీణా స్టోర్స్ వద్దకు విలాసవంతమైన కారు నెం. కేఏ 05 ఎన్‌కే 7275 లో చేరుకున్నారు. అనంతరం కారు ముందుకు చేరుకుని బీరు బాటిల్స్ చేతిలో పట్టుకుని తాగారు.

ఆ సమయంలో వారిని స్థానికులు నిలదీయడంతో రమేష్ దిమ్లా రెచ్చిపోయాడు. షర్ట్ తీసి రోడ్డుపై గిరాటేసి, ప్యాంట్‌ను మోకాళ్ల వరకు ఎత్తి చూసుకుందాం రండని సవాల్ విసిరాడు. అర్ధనగ్న దుస్తులు వేసుకున్న మాధురి, మరో యువతి అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో మహిళలు తలలు దించుకుని వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించారు. వీరి ప్రవర్తన విషమిస్తుండడంతో సహనం కోల్పోయిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో మల్లేశ్వరం పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ శుక్రవారం వెల్లడించారు.

వీరితో సంబంధం ఉన్న కొంత మంది రాజకీయ పెద్దలు పోలీసులకు ఫోన్ చేసి విడుదల చేయాలని ఒత్తిడి తెచ్చినా అప్పటికే మీడియా ఛానాళ్ళు ఈ వార్తను హోరెత్తించడంతో ఏం చేయలేమని చేతులెత్తేశారు. మద్యం మత్తులో ఇలా రోడ్డు పైకి వచ్చి నానా హంగామా చేయడం పై సామాన్య ప్రజలు, మహిళలు వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles