Very severe cyclone lehar effect in coastal area

Very severe cyclone Lehar, Andhra Pradesh, Coast Guard, Cyclone, Cyclone Helen, Cyclone Lehar, east Godavari, effect in coastal area

Andhra Pradesh now bracing for very severe cyclonic storm Lehar that is expected to make landfall tomorrow, packing wind speeds of up to 200 kmph.

ముంచుకొస్తున్న ‘లెహర్ ’ ప్రమాదం

Posted: 11/27/2013 09:37 AM IST
Very severe cyclone lehar effect in coastal area

ప్రక్రుతి కన్నెర్ర జేసింది. కోస్తాంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మొన్న ఫైలిన్ తుఫాన్, నిన్న హెలెన్ తుఫాన్ లు మిగిల్చిన నష్టాన్ని మరచి పోక ముందే మరో తుఫాన్ ‘లెహర్ ’ వచ్చి ప్రజల్ని భయాందోళలకు గురి చేస్తుంది. బంగాళ ఖాతంలో ఏర్పడిన లెహర్ తుఫాన్ బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 800కి.మీ దూరంలో నిలకడగా ఉంది.

ఇది పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం తీరాల మీదుగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చని, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని, యానాంలోనూ భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు. 

విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. నేడు గంటకు 160 నుండి 200 కి.మీ వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని, ఈ గాలుల వల్ల సముద్రంలోని అలలు 3 మీటర్ల వరకు ఎగసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన జిల్లాల యంత్రాంగం తుఫాన్ ని ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టింది. క్రిష్ణా జిల్లాలో రేపు ఎల్లుండి పాఠశాలలకు కలెక్టర్ సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles