Modi shortlisted by time for person of the year title

Modi shortlisted by Time Person of the Year title, Time magazine,Shinzo Abe,person of the year,Narendra Modi,Malala Yousafzai,Edward Snowden,Barack Obama

BJP prime ministerial candidate Narendra Modi is among Time magazines shortlisted candidates for its Person of the Year title.

టైమ్స్ టైటిల్ రేసులో మోదీ

Posted: 11/26/2013 08:06 PM IST
Modi shortlisted by time for person of the year title

బీజేపీ ప్రధాని అభ్యర్థి , గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రస్తుతం ఉన్న హవా అంతా ఇంతా కాదు....టెక్నాలజీని వాడుకునే రాజకీయ నాయకుడిగా పేరొందిన మోడీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రముఖ మేగజైన్ అయిన టైమ్స్ ప్రపంచంలో అంత్యంత ప్రభావశీలురు నేతలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో ఇలా అన్ని రంగాలతో కూడిన 42 మంది పేర్లతో ఓ జాబితాను రూపొందించింది.

అందులో నరేంద్ర మోడీ పేరు కూడా ఉంది. వీరందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి, ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2013 ’ టైటిల్ ని అందించడానికి ఆన్ లైన్ ద్వారా పోలింగ్ నిర్వహించి వచ్చే నెలలో విజేత ఎవరో ప్రకటించనున్నారు. ఈ టైటిల్ కోసం ఎంపిక చేసిన షార్ట్ లిస్టులో తనకు స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచారు.

ఈ టైటిల్ కోసం జపాన్ ప్రధానమంత్రి షింన్జో అబె, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాకిస్థాన్ సాహస బాలిక మలాల యూసఫ్ జాయ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్, బ్రిటీష్ యువరాజ్ ప్రిన్స్ జార్జ్ తదితరులు పోటీ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles