Professor kodandaram fire on cm kiran

professor kodandaram fire on cm kiran, Kodandaram Fires On CM Kiran Kumar Reddy Professor Kodandaram, TJAC Kodandaram, congress party, seemandhra leaders, andhra pradesh,

professor kodandaram fire on cm kiran, Kodandaram Fires On CM Kiran Kumar Reddy

సీఎం కనిపిస్తే కొట్టాలనిపిస్తోంది : తెలంగాణ రెడ్డి

Posted: 11/25/2013 10:49 AM IST
Professor kodandaram fire on cm kiran

రాష్ట్ర ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాకు ఎదురుపడితే.. కొట్టాలనిపిస్తోందని.. తెలంగాణ రెడ్డిగారు అన్నారు. ఇంతకీ ఈ తెలంగాణ రెడ్డి రాజకీయ నాయకుడు కాదులేండి. ప్రత్యేక తెలంగాణ కోసం.. విద్యార్థుల వెనుక ఉండి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన రథసారధి తెలంగాణ జేఏసి చైర్మన్ ఫ్రొ.కోదండరాం రెడ్డి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తే కొట్టానికి సిద్దంగా ఉన్నాడు. హైదరాబాద్‌ నగరం, తెలంగాణ ప్రాంతాలు నిజాం హయాంలోనే అభివృద్ధి చెందాయని, అయితే అందుకు విరుద్ధంగా... ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడ్డాకే తాము అభివృద్ధి చేశామని కిరణ్‌ కుమార్‌ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ప్రొ. కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సీఎం ఎదురుపడితే కొట్టాలనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

అసెంబ్లీని ప్రోరోగ్‌ చేస్తే తెలంగాణ బిల్లు ఆగి పోతుందని అనుకుంటే సీఎం కిరణ్‌ ముర్ఖత్వమే అవుతుం దన్నారు. ఒక వేళ ప్రోరోగ్‌ కు ప్రయత్నిస్తే తెలంగాణ మంత్రులు అడ్డుకోవాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబే బాధ్యత వహించాలని, సహకరిస్తారో.. నిలువరిస్తారో తేల్చుకోవాలని సూచించారు. సీమాంధ్రులు రోజుకో మాట చెపుతూ.. కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తే మరో పోరాటానికి సిద్ధమని కోదండరామ్‌ హెచ్చరించారు.

 

సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇచ్చిన ఎన్‌బీఆర్‌బీ నివేదిక తప్పుల తడక అని అభివర్ణించారు. భద్రాచలం, మునగాల తెలంగాణ అంతర్భాగమేనని, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని, ఆర్టికల్‌ 371/డి ప్రతిబంధకం కాదని, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతు న్నాయని ఆయన అన్నారు. ఇందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అందులో ఎలాంటి అను మానం లేదని పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles