Lehar cyclone to hit ap coast on nov 28

Lehar cyclone to hit AP coast on Nov 28, Phailin cyclone, Helen cyclone, lehar cyclone,

Lehar cyclone to hit AP coast on Nov 28

మన రాష్ట్రం పై పగబట్టిన ‘లెహర్ ’

Posted: 11/25/2013 01:02 PM IST
Lehar cyclone to hit ap coast on nov 28

మొన్న ఫైలిన్ నిన్న హెలెన్ నేడు లెహర్ల తో మనిషి భయపడి చస్తున్నారు. ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా మూడు తుపాన్లు తాకిడి మనిషి పై పడింది. మన రాష్ట్రం పై ప్రకృతి పగబట్టినట్లు తెలస్తోంది. ఒక దాని తరువాత ఒక తుపాన్ వస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. హెలెన్ తుపాన్ ముప్పు తప్పిందో లేదో మరో తుపాన్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన లెహర్ తుపాన్ రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం అండమాన్ లో కేంద్రీకృతమైన లెహర్ తుపాన్ పోర్ట్ బ్లెయిర్ లో తీరం దాటనుంది.

తరువాత ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తరువాత పెను తుపాన్ గా మారనుంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 28వ తేదీన మచిలీపట్నం - కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తుపాన్ రాష్ట్రం వైపు దూసుకొస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ తుపాన్ ఫైలిన్ కన్నా భయంకరమైందని.. గతమెన్నడు జరగని ఘోరాన్ని చూపించబోతోందని..తుపాన్ దెబ్బకు ఊళ్లకు ఊళ్లే ఊడ్చుకపోతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బుధ, గురువారాల్లో గంటకు 180 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అన్ని ప్రధాన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles