Yashodhra raje has tea set of 1 5 crores

yashodhra raje has tea set of 1.5 crores, Bharatiya Janata Party leader Yashodhara Raje, Congress, Election Commission, Jyotiraditya Scindia, Madhavrao Scindia, Madhya Pradesh, Rahul Gandhi, Yashodhara Raje

yashodhra raje has tea set of 1.5 crores

ఆమె టీ సెట్ తో ఎన్నికల సంఘం షాక్

Posted: 11/21/2013 10:18 AM IST
Yashodhra raje has tea set of 1 5 crores

మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యశోధర రాజే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ఆస్తులలో రూ.1.5 కోట్ల విలువైన టీ సెట్‌ ఉందని పేర్కొనడమే దీనికి కారణం.యశోధర మాట్లాడుతూ ఇందులో తప్పేమీ లేదన్నారు. తాను రాజ కుటుంబీకురాలినని పుట్టిన రోజులు తదితర ప్రత్యేక సందర్భాల్లో తాము బంగారం, వెండి పళ్లాలు, కటోరాల్లో భోజనం చేసేవారమని తెలిపారు. ఇది కుటుంబ సంప్రదాయమని అన్నారు.

 

తనకు వివాహం జరిగినపుడు ఆరు బంగారు కటోరాలు తన కుటుంబం ఇచ్చిందని పేర్కొన్నారు. గ్వాలియర్‌ రాజకుటుంబీకురాలైన యశోధర నవంబరు 25న జరిగే ఎన్నికల కోసం శివపురి నుంచి పోటీ చేస్తున్నారు. మీడియాకు వివాదాలంటే ఇష్టంగా ఉన్నట్లుందని, అందుకే తన ఆస్తుల్లో ఈ టీ సెట్‌ కొత్తగా చేరిందని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ధనవంతులైన అభ్యర్థులను అవినీతిపరులని ప్రజలు భావించే అవకాశం తక్కువ ఉంటుందన్నారు.

 

తాను, తన సోదరి వసుంధర రాజే (రాజస్థాన్‌ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని), జ్యోతిరాదిత్యసింథియాలను ప్రజలు లంచాలు తీసుకునేవారిగా చూడరని తెలిపారు. కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింథియా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిథిలోనే శివపురి ఉంది. ఆయనను ఇరుకునపెట్టేందుకే యశోధరను ఆ స్థానంనుంచి బీజేపీ పోటీ చేయిస్తోందని పరిశీలకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles